Polavaram Project: 2027లోగా పోలవరం ప్రాజెక్టు పూర్తి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు 2027 నాటికి పూర్తి చేస్తామని ప్రకటించారు.

ఈ ప్రాజెక్టు ఎత్తును తగ్గిస్తున్నారని వచ్చిన విమర్శలలో వాస్తవం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. 45.72 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు నిర్మాణం కొనసాగుతుందని, ఈ విషయంలో ఎన్డీయే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కట్టుబడినాయని తెలిపారు. 

నవంబర్ 19వ తేదీన శాసనసభలో పోలవరం, సాగునీటి ప్రాజెక్టులపై జరిగిన స్వల్పకాలిక చర్చలో 13 మంది ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా.. చంద్రబాబు ప్రాజెక్టు సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలను వెల్లడించారు.  

జనవరి నుంచి పోలవరం కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మాణం ప్రారంభిస్తామని, రూ.70 వేల కోట్లతో గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం చేసి ప్రతి ఎకరాకూ నీళ్లిస్తామని చెప్పారు. తీరంలో పోర్టులు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

AP New Airports: ఏపీలో కొత్తగా ఆరు ఎయిర్‌పోర్టులు.. ఈ జిల్లాల్లోనే..

పోలవరం ప్రాజెక్టు ఇప్పటిది కాదని.. 1941లోనే ప్రతిపాదన వచ్చిందన్నారు. రామపాద సాగర్‌ పేరుతో భూమిని ఎంపిక చేశారన్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాక పోలవరం ప్రాజెక్టును అస్తవ్యస్థం చేశారని చంద్రబాబు ఆరోపించారు. తెలంగాణలో ఉన్న 7 ముంపు మండలాలను ఏపీలో కలపకపోతే తాను సీఎంగా ప్రమాణ స్వీకా­రం చేయనని పట్టుబట్టడం వల్లే కేంద్రం వాటిని ఏపీలో కలిపిందని చెప్పారు. 

అలా కలపకపోయి ఉంటే.. తెలంగాణ ఒప్పుకోకపోతే పోలవరం ఎప్పటికీ సాధ్యమయ్యేది కాదన్నారు. గత ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో కాంట్రాక్టర్‌ను మార్చిందని, 15 నెలల పాటు పోలవరం ప్రాజెక్టు పనులు నిలిపివేసిందన్నా­రు. 2020లో వరదలకు డయాఫ్రం వాల్‌ దెబ్బతింటే దానిని వెంటనే గుర్తించలేకపోయారన్నారు.

కొత్త వాల్‌ నిర్మాణానికి రూ.990 కోట్లు ఖర్చవుతుందని వెల్లడించా­రు. ఆలస్యం వల్ల ప్రాజెక్టు వ్యయం పెరిగిందన్నారు. 2019 నాటికి 71.93 శాతం ప్రాజెక్టును తన హయాంలో పూర్తి చేస్తే గత ప్రభుత్వం హయాంలో 3.84 శాతం మాత్రమే పూర్తయ్యిందన్నారు.

ESICON 2024: విశాఖ‌లో 53వ జాతీయ స్థాయి సదస్సు

#Tags