AP-Telangana: విభజన సమస్యలపై ఏర్పాటైన కమిటీకి ఎవరు నేతృత్వం వహించనున్నారు?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య విభజనకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న పలు వివాదాల పరిష్కారానికి కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి ఆశిష్‌ కుమార్‌ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఉప కమిటీని ఏర్పాటు చేసింది. ఈ త్రిసభ్య కమిటీలో ఏపీ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్, తెలంగాణ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావులకు స్థానం కల్పించింది. కమిటీ తొలి  సమావేశం ఈ నెల 17వ తేదీన ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరుగుతుందని, అజెండాలో ప్రత్యేక హోదాతో పాటు మరో 8 అంశాలు ఉన్నాయని ఇరు రాష్ట్రాలకు కేంద్ర హోం శాఖ ఫిబ్రవరి 11న తెలియజేసింది.
 

చ‌ద‌వండి: ప్రస్తుతం ఎన్‌హెచ్‌ఏఐ చైర్మన్‌గా ఎవరు ఉన్నారు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : 
కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి ఆశిష్‌ కుమార్‌ నేతృత్వంలో త్రిసభ్య కమిటీ ఏర్పాటు
ఎప్పుడు : ఫిబ్రవరి 13
ఎవరు    : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య విభజనకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న పలు వివాదాల పరిష్కారానికి..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

#Tags