IITH: ఐఐటీహెచ్‌లో బాహుబలి డ్రోన్‌ తయారీ!

విపత్తులు వచ్చినప్పుడు, ప్రభావిత ప్రాంతాలకు సహాయ పదార్థాలను చేరవేయడం అనేది అత్యంత కష్టతరమైన పని.

ప్రత్యేకించి, రోడ్లు దెబ్బతిన్నా లేదా ప్రయాణించడానికి అనువుగా లేని ప్రాంతాల్లో ఈ పని మరింత కష్టతరం అవుతుంది. అటువంటి పరిస్థితుల్లో.. బాధితులకు సాయం అందించడం సవాళ్లతో కూడుకున్న పని, చాలాసార్లు హెలికాప్టర్‌ వెళ్లలేని ప్రాంతాలు సైతం ఉంటాయి.
 
ఇలాంటి పరిస్థితులను దీటుగా ఎదుర్కొనేందుకు ఐఐటీ హైదరాబాద్‌లో చేపట్టిన డ్రోన్ల తయారీ ప్రాజెక్టు తుదిదశకు చేరింది. ఇప్పటికే 60 కిలోల బరువు తీసుకువెళ్లే డ్రోన్‌ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేశారు. 100 కిలోల బరువును అవలీలగా తరలించే చేపట్టిన ప్రాజెక్టు ప్ర‌స్తుతం ప్రయోగ దశలో ఉంది. ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఐఐటీహెచ్‌ టీహాన్‌ కృషి చేస్తుంది. 

New Scheme: వైద్య పరికరాల తయారీకి కొత్త పథకం

#Tags