Telangana Voters: తెలంగాణలో ముసాయిదా ఓటరు జాబితా విడుదల‌

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ముసాయిదా ఓటరు జాబితా విడుదలైంది.

ఎన్నికల సంఘం స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌ (ఎస్‌ఎస్‌ఆర్‌)-2025 ప్రణాళికలో భాగంగా ఈ జాబితాలను ప్రతి పోలింగ్‌ కేంద్రంలో అందుబాటులో ఉంచనున్నారు. 

ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 3,34,10,375 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,66,01,108 మంది పురుషులు, 1,68,06,490 మంది మహిళలు మరియు 2,777 మంది ఇతరులు ఉన్నారు.

2025 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండే వ్యక్తులు తమ ఓటుహక్కు కోసం నమోదు చేసుకోవచ్చు. కొత్తగా నమోదు కావడానికి, ఫారం-6, అభ్యంతరాల కొరకు ఫారం-7, సవరణల కోసం ఫారం-8ను ఉపయోగించాలి. ముసాయిదా జాబితాలో పేరు సక్రమంగా ఉందో లేదో తనిఖీ చేసుకోవచ్చు. అభ్యంతరాలు లేదా మార్పులు ఉంటే, నవంబర్‌ 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వాటిని డిసెంబర్‌ 24 వరకు పరిష్కరిస్తారు.

Andhra Pradesh Voters: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెరిగిన ఓటర్ల సంఖ్య.. ఎంతంటే?

2025 జనవరి 6వ తేదీ ఎస్‌ఎస్‌ఆర్‌-2025 తుది ఓటర్ల జాబితా విడుదల కానుంది. అదేవిధంగా.. రాష్ట్రంలోని అన్ని పోలింగ్‌ బూత్‌లలో నవంబర్‌ 9, 10 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. కొత్తగా నమోదు కావడానికి లేదా సవరణలు చేసుకోవడానికి, ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ (voters.eci.gov.in), వోటర్‌ హెల్ప్‌లైన్ మొబైల్‌ యాప్‌ను ఉపయోగించవచ్చు.

#Tags