Chhattisgarh New CM: ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్ సాయ్
59 ఏళ్ల విష్ణుదేవ్ రాష్ట్రంలోని సుర్గుజా ప్రాంతంలోని జష్‌పూర్ జిల్లా కుంకురీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని కాబోయే ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌ను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆహ్వానించారని రాజ్‌భవన్ ఒక ప్రకటనలో పేర్కొంది.
Madhya Pradesh New CM: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్
సర్పంచ్‌గా మొదలై ఆదివాసీ సీఎం దాకా...
ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ కీలక నేతల్లో విష్ణుదేవ్ ఒకరు. రాజకీయ నేపథ్యం నుంచి వచ్చారు. సర్పంచ్‌గా రాజకీయ జీవితం మొదలెట్టి ఆ తర్వాత పలుమార్లు లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి మోదీ తొలి కేబినెట్‌లో కేంద్ర మంత్రిగా సేవలందించారు. పార్టీ రాష్ట్ర చీఫ్‌గా మూడుపర్యాయాలు పనిచేసి అధిష్టానం మెప్పు పొందారు. 1990లో బగియా గ్రామ సర్పంచ్‌గా గెలిచారు. అదే ఏడాది అవిభాజ్య మధ్యప్రదేశ్‌లో తప్‌కారా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1999, 2004, 2009లో రాయ్‌గఢ్ ఎంపీగా గెలిచారు. మోదీ తొలిసారి ప్రధాని అయ్యాక కేంద్ర ఉక్కు, గనుల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు.
ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీలో మెజారిటీ సీట్లు గెలిస్తే విష్ణుదేవ్‌ను ‘పెద్దనేత’ను చేస్తామని ఇటీవల ఎన్నికల ప్రచారసభలో అమిత్ షా ప్రకటించడం తెల్సిందే. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఏర్పడ్డాక అజిత్ జోగీ తొలి ఆదివాసీ సీఎంగా రికార్డులకెక్కారు. ఆయన తర్వాత ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబోతున్న ఆదివాసీ నేతగా విష్ణుదేవ్ పేరు నిలిచిపోనుంది. విష్ణుదేవ్ తాత బుద్ధనాథ్ సాయ్ 1947–52 వరకు నామినేటెడ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయన పెదనాన్న నరహరి ప్రసాద్ రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, జనతాపార్టీ ప్రభుత్వంలో సహాయ మంత్రిగాచేశారు. ఇంకో పెదనాన్న సైతం గతంలో ఎమ్మెల్యేగా గెలిచారు.
Lalduhoma sworn as Mizoram CM: మిజోరం సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన లాల్దుహోమా