Veera Rana: మధ్యప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వీర రాణా

మధ్యప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారిణి వీర రాణా నియమితులయ్యారు.
Veera Rana Appointed Chief Secretary of Madhya Pradesh

రాష్ట్ర సీఎస్‌గా గురువారం ఆమె అదనపు బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఈ మేరకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం బుధవారం రాత్రి నోటీసులు జారీ చేసింది. వీర రాణా ప్రస్తుతం మధ్యప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఆమె రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Microsoft Global Delivery Centre Leader: మైక్రోసాఫ్ట్ గ్లోబల్ డెలివరీ సెంటర్ లీడర్‌గా అపర్ణ గుప్తా

రెండు సార్లు పొడిగింపుల తర్వాత పదవీ విరమణ చేయనున్న  అవుట్‌గోయింగ్ సీఎస్‌ ఇక్బాల్ సింగ్ బెయిన్స్ స్థానంలో 1988 బ్యాచ్‌కు చెందిన వీర రాణా నియమితులయ్యారు. 

రెండో మహిళగా రికార్డ్‌

మధ్యప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన రెండో మహిళగా వీర రాణా రికార్డు సృష్టించారు. 1990వ దశకం ప్రారంభంలో మధ్యప్రదేశ్‌కు తొలి మహిళా ప్రధాన కార్యదర్శిగా ఐఏఎస్ అధికారిణి నిర్మలా బుచ్ నియమితులయ్యారు. ఈమె ఈ ఏడాది జూలైలో కన్నుమూశారు. 

Interim CEO of OpenAI: ఓపెన్‌ఏఐ తాత్కాలిక సీఈఓగా మీరా మురాటి

#Tags