World Record: గిన్నిస్ రికార్డు.. గుమ్మడికాయ పడవలో ప్రయాణం.. 26 గంటలు..

అమెరికాకు చెందిన గ్యారీ క్రిస్టెన్‌సేన్ గిన్నిస్ ప్రపంచ రికార్డును సృష్టించాడు.

ఒరెగాన్‌లోని హ్యాపీ వ్యాలీకి చెందిన గ్యారీ క్రిస్టెన్‌సెన్ అసాధారణమైన గిన్నిస్‌ రికార్డు సాధించాడు. ఓ బారీ గుమ్మడికాయను పడవగా మార్చి ఏకంగా కొలంబియా నదిలో 26 గంటలు ప్రయాణించి ఈ రికార్డు సృష్టించాడు. ఆయన వాషింగ్టన్‌లోని నార్త్ బోన్నెవిల్లే నుంచి ప్రారంభించి.. 73.50 కిలో మీట‌ర్ల‌ దూరంలో కెనడాలో ఉన్న వాంకోవర్‌ వరకు సుదీర్ఘ ప్రయాణం చేసి ఈ రికార్డుని నెలకొల్పాడు. 
 
గుమ్మడి కాయలు..
గ్యారీ 2011 నుంచి అతి పెద్ద గుమ్మడి కాయలను పెంచడం ప్రారంభించాడు. అలా 2013లో అతిపెద్ద గుమ్మడికాయతో తొలిసారిగా పడవ తయారు చేసి  ‘వెస్ట్‌కోస్ట్‌ జెయింట్‌ పంప్‌కిన్‌ రెగట్టా’ పోటీల్లో విజయం సాధించారు. అప్పటి నుంచి గ్యారీకి ఇలా భారీ గుమ్మడికాయలను పండించడం వాటిని పడవగా మలచడం ఒక అలవాటుగా మారింది. 

ఆ క్రమంలోనే గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డుపై దృష్టసారించాడు. అందుకోసం గ్యారీ  అక్టోబర్ 4వ తేదీ 556 కిలోల భారీ గుమ్మడికాయను పండించాడు. ఆ తర్వాత అక్టోబర్ 5వ తేదీ అధికారుల సమక్షంలోనే పడవగా తయారు చేసి తన సాహసకృత్యాన్ని ప్రారంభించారు. అక్టోబర్ 12వ తేదీ ఉత్తర బాన్‌విల్‌లోని కొలంబియా నదీతీరానికి చేరుకున్నారు. అలా గ్యారీ గుమ్మడి కాయ పడవతో ఏకాధాటిగా 26 గంటలు  ప్రయాణించి ఈ ప్రపంచ రికార్డుని సాధించాడు.

World Record: ఏపీ పంచాయతీరాజ్ శాఖకు వరల్డ్ రికార్డ్‌!

#Tags