Global Marketing Award: ప్రొఫెసర్ జగదీష్ షేత్‌కు గ్లోబల్ మార్కెటింగ్ అవార్డు

గ్లోబల్ మార్కెటింగ్ స్పెషల్ ఇంట్రెస్ట్ గ్రూప్ (SIG) ప్రొఫెసర్ జగదీష్ షెత్‌కు 2024 గ్లోబల్ మార్కెటింగ్ అవార్డును ప్రకటించింది.

ఈ అవార్డు గ్లోబల్ మార్కెటింగ్ రంగంలో ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఇవ్వబడింది.

ఈ అవార్డును ఎవరికి ఇవ్వాలనే దానిపై నిర్ణయం తీసుకోవడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి లీడ్స్ యూనివర్శిటీ బిజినెస్ స్కూల్‌కు చెందిన ప్రొఫెసర్ కాన్‌స్టాంటైన్ ఎస్.కాట్సికేస్ నాయకత్వం వహించారు. కనెక్టికట్ యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్ రాబిన్ కౌల్టర్, మోల్డే యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్ కార్లోస్ సౌసా ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.

ప్రొఫెసర్ షెత్ గత 40 సంవత్సరాలుగా ప్రపంచ మార్కెటింగ్ రంగంలో ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఈ రంగంలో అనేక రచనలు చేశారు. ఇందులో ఒకటి 'ది గ్లోబల్ రూల్ ఆఫ్ త్రీ'. ఈ పుస్తకాన్ని 2020లో ప్రచురించారు. ఇది అకాడమీ ఆఫ్ మేనేజ్‌మెంట్ యొక్క ప్రతిష్టాత్మక జార్జ్ ఆర్.టెర్రీ అవార్డుకు నామినేట్ అయింది. ఈయన 2020లో భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్  అవార్డును దక్కించుకున్నారు.

National Award: ఐఏఎస్ అధికారి కృష్ణతేజకు జాతీయ పుర‌స్కారం

#Tags