New Governors: తొమ్మిది రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం.. తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ ఈయ‌నే..

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించి, మరో ముగ్గురిని వేరే రాష్ట్రాల నుంచి బదిలీ చేశారు.

దీనికి సంబంధించిన వివ‌రాల‌ను జూలై 29వ తేదీ రాత్రి రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో విడుదల చేసింది. 

➤ తెలంగాణ కొత్త గవర్నర్​గా త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి జిష్షుదేవ్ వర్మ   నియమితులయ్యారు. 

➤ పంజాబ్ గవర్నర్​గా ఉన్న ఛండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ బన్వరిలాల్ పురోహిత్ రాజీనామా చేశారు. దీంతో ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌గా లాబ్ చంద్ కటారియా నియమితులయ్యారు. 

➤ మహారాష్ట్ర గవర్నర్​గా సీపీ రాధాకృష్ణన్​ను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న రమేష్ బైస్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. రాధాకృష్ణన్ ఝార్ఖండ్ మాజీ గవర్నర్. 

➤ ఝార్ఖండ్​ గవర్నర్​గా రాధాకృష్ణన్ స్థానంలో కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ బాధ్యతలు చేపట్టనున్నారు.

➤ రాజస్థాన్ గ‌వర్నర్‌గా కల్రాజ్ మిశ్రా స్థానంలో మహారాష్ట్రకు చెందిన బీజేపీ సీనియర్ నేత హరిభౌ కిసన్‌రావ్‌ బాగ్డే నియమితులయ్యారు. 

Supreme Court: సుప్రీంకోర్టులో ఇద్దరు కొత్త న్యాయమూర్తులు.. తొలిసారి మణిపూర్ నుంచి నియామకమైనది ఎవరో తెలుసా?

➤ అస్సాం గవర్నర్‌గా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య నియమితులయ్యారు. ఆయనకు మణిపుర్‌ గవర్నర్‌గా కూడా అదనపు బాధ్యతలు అప్పగించారు. 

➤ మేఘాలయ గవర్నర్​గా కర్ణాటకలోని మైసూరుకు చెందిన మాజీ లోక్​సభ సభ్యుడు సీహెచ్ విజయశంకర్‌ను నియమించారు. 

➤ సిక్కిం కొత్త గవర్నర్​గా బీజేపీ సీనియర్ నేత ఓం ప్రకాశ్ మాథుర్ నియమితులయ్యారు.

➤ ఛత్తీస్​గఢ్​ గవర్నర్ ప‌ద‌విని అసోంకు చెందిన మాజీ లోక్ సభ సభ్యుడు రామన్ దేకా స్వీక‌రించ‌నున్నారు.

Vikram Misri: విదేశాంగ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన విక్రమ్‌ మిస్రీ

#Tags