President of Venezuela : వెనిజువెలా అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన నికోలస్ మదురో..
వెనిజువెలా అధ్యక్ష ఎన్నికల్లో నికోలస్ మదురో మళ్లీ గెలుపొందారు. కొన్నేళ్లుగా తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఆయన అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందటంపై ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేశాయి. ఎన్నికల్లో నికోలస్ మదురోకు 51శాతం ఓట్లు, ప్రధాన ప్రతిపక్ష అభ్యర్థి ఎడుముందో గోంజలేజ్‌కు 44శాతం ఓట్లు వచ్చాయని ‘నేషనల్ ఎలక్టోరల్ కౌన్సెల్’ ప్రకటించింది. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎడ్మండో గొంజాలెజ్‌కు 44 శాతం ఓట్లొచ్చినట్టు వెల్లడించారు. దీనిపై విపక్షాలన్నీ తీవ్రంగా మండిపడ్డాయి. తక్షణం దేశవ్యాప్తంగా మొత్తం 30 వేల పోలింగ్ బూత్‌లవారీగా పోలైన ఓట్ల వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు.
Anand Mahindra: స్కిల్ యూనివర్సిటీ చైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా
ఫలితాలపై దేశాల పెదవి విరుపు
వెనిజులా ఎన్నికల ఫలితాలు అస్సలు నమ్మశక్యంగా లేవని అమెరికా, చిలీ,ఉరుగ్వేతో పాటు చాలా దేశాలు పేర్కొన్నాయి. అవి ప్రజల మనోగతాన్ని, ఓటింగ్ సరళిని ప్రతిఫలించడం లేదని స్పష్టం చేశాయి. చిలీ అధ్యక్షుడు గేబ్రియెల్ బోరిక్, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో పాటు బ్రిటన్ కూడా ఈ మేరకు ప్రకటన చేసింది.
DG of Army Medical Services : ఆర్మీ మెడికల్ సర్వీసెస్ డీజీగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళ..