Madhya Pradesh New CM: మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా మోహన్‌ యాదవ్‌

మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా మోహన్‌ యాదవ్‌(58) పేరును బీజేపీ అధిష్టానం ప్రకటించింది.
Mohan Yadav becomes the new Chief minister of Madhya Pradesh

 భోపాల్‌లో బీజేపీ హెడ్‌క్వార్టర్స్‌లో జరిగిన పార్టీ లెజిస్లేటివ్‌ భేటీ అనంతరం ఈ ప్రకటన చేసింది.  తాజా ఎన్నికల్లో మోహన్‌ యాదవ్‌ దక్షిణ ఉజ్జయిని నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతంలో శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ కేబినెట్‌లో విద్యాశాఖ మంత్రిగా పని చేశారు మోహన్‌ యాదవ్‌. 

Telangana CM Revanth Reddy Success Story : డైరెక్ట్ ఎమ్మెల్యే టూ..ముఖ్య‌మంత్రిగా రేవంత్ రెడ్డి.. స‌క్సెస్ జ‌ర్నీ ఇదే..

మోహన్‌ యాదవ్‌.. 25 మార్చి 1965లో ఉజ్జయినిలో జన్మించారు. 2013లో తొలిసారిగా ఉజ్జయిని సౌత్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత 2018లో మళ్లీ అదే అసెంబ్లీ స్థానంలో గెలుపొందారు. ఇక.. మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌గా కేంద్ర మాజీ మంత్రి, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన నరేంద్ర సింగ్‌ తోమర్‌ను ప్రకటించారు. 

Lalduhoma sworn as Mizoram CM: మిజోరం సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన‌ లాల్దుహోమా

 

#Tags