Skip to main content

Mohan Charan Majhi: ఒడిశా సీఎంగా మోహన్ చరణ్ మాఝీ ప్రమాణం

ఒడిశా 15వ ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నాయకుడు, 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మోహన్‌ చరణ్‌ మాఝీ జూన్ 12వ తేదీ ప్రమాణ స్వీకారం చేశారు.
Mohan Charan Majhi takes oath as Odisha's new Chief Minister

అతను ఒడిశాలో మొదటి బీజేపీ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి, ఒడిశా 3వ గిరిజన ముఖ్యమంత్రిగా స్థానం సాధించారు. అతనితో పాటు ఇద్దరు డిప్యూటీలు కనక వర్ధన్‌ సింగ్‌దేవ్‌, ప్రభాతి పరిడాలు ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 

సంతాల్‌ జాతికి చెందిన 52 ఏళ్ల మోహన్‌ చరణ్‌ మాఝీ, కాంగ్రెస్‌ దివంగత హేమానంద బిశ్వాల్‌, గిరిధర్‌ గొమాంగో తర్వాత రాష్ట్రానికి మూడో గిరిజన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 

Odisha Election Results: ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ

1997 నుంచి 2000 వరకు సర్పంచ్‌గా తన రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన వివాదాస్పద, సరళమైన స్వభావానికి ప్రసిద్ధి చెందారు. కేంఝర్‌ అసెంబ్లీ స్థానం నుంచి 2000, 2009, 2019, 2024లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 
రాష్ట్ర గవర్నర్‌ రఘుబర్‌ దాస్‌ వారితో ప్రమాణ స్వీకారం, గోప్యతా ప్రమాణం చేయించారు.

Published date : 13 Jun 2024 03:26PM

Photo Stories