World's Tallest and Shortest Women : ప్రపంచంలోనే అత్యంత ఎత్తు, పొట్టిగా ఉన్న మహిళలు.. గిన్నీస్‌లో గుర్తింపు..!
సాక్షి ఎడ్యుకేషన్: ఎంతో ప్రత్యేకమైన, అరుదైన సంఘటన లండన్‌లో జరిగింది. తీవ్రస్థాయి సమావేశంలో తొలిసారి కలుసుకున్న ఇద్దరు మహిళలు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన మహళ, అగ్యంత పొట్టి మహిళ. లండన్‌లో జరిగిన 20వ వార్షిక గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ డే, సావోయ్ హోటల్‌లో నిర్వహించారు. ఇక్కడ ఇద్దరు ఎదురు పడడమే కాకుండా, కలిసి చర్చలు జరిపారు. వీరిద్దరు కలవడం గిన్నీస్ వరల్డ్ బుక్ రికార్డు వలన సాధ్యం అయ్యింది. వారి అధికారిక హ్యాండిల్ ఈ అద్భుతమైన రెండెజౌస్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Transportation Secretary: అమెరికా రవాణామంత్రిగా ఫాక్స్ న్యూస్ హోస్ట్ సాన్ డఫీ
మహిళల ఎత్తు..
ఇక్కడ కనిసిస్తున్న అత్యంత పొడవు మహిళ పేరు రుమీసా గెల్గి.. ఈ మహిళ 7 అడుగుల 8.3 అంగులాలు ఉంటుంది అంటే, 234.5 సెం.మీ.. అత్యంత పొట్టిగా ఉన్న మహిళ పేరు జ్యోతి అమ్గే.. ఈ మహిళ 24.7 అంగుళాల అంటే, 62.8 సెం.మీ. ఉంటుంది.
వ్యక్తులు ఎంత ఎత్తుగా ఉన్న ఎంత పొట్టిగా ఉన్న కొందరు బాధ పడుతుంటారు. కాని, ఇక్కడ మాత్రం వీరికి ఎటువంటి బాధలు లేవు. బాధలు లేకపోగా, వీరు ఎంతోమందికి ప్రస్తుతం స్పూర్తిదాయకంగా నిలుస్తున్నారు.
ఎంతకుముందే!
వీరిద్దరు విడిగా కొన్ని సంవత్సరాల ముందే గిన్నీస్ వరల్డ్ బుక్ రికార్డులో స్థానం సంపాదించుకున్నారు. 2011లో అత్యంత పొట్టిగా ఉన్న మహిళ జ్యోతి అమ్గేకు గిన్నీస్ బుక్‌లో చోటు దక్కింది. పొట్టిగా ఉన్నప్పటికీ గట్టిగా నిలిచేలా ఎదిగింది. అంతేకాకుండా, స్వీయ అంగీకారంగా ఎదగి, సాధికారితకు చిహ్నంగా కూడా మారింది.
కొన్ని సంవత్సరాల తరువాత, అంటే.. 2021లో ప్రపంచంలోనే అత్యంత పొడవైన మహిళగా రుమీసా గెల్గికు గిన్నీస్ బుక్‌లో చోటు దక్కింది. ఎంత ఎత్తు ఉన్నప్పటికి కొన్ని విషయాల్లో వెనుకబడతారనే భయం ఉంటుంది. కాని, తన భయాన్నే బలంగా చేసుకొని, తన ఎత్తుని తన ప్రయోజనం ఉపయోగించుకుంది ఈ మహిళ.
CAG: కాగ్ చీఫ్‌గా నియమితులైన సంజయ్ మూర్తి
ఉమ్మడి విషయాలు..
అత్యంత పొడవు, పొట్టి ఉన్న మహిళిద్దరు కలిన క్షణంలో కలిసి టీ తాగుతూ చర్చలు జరిపారు. ఒకరి అందం గురించి ఒకరు పొగిడారు. వారికి ఉన్న ఎత్తు వ్యత్యాసం కారణంగా కంటికి పరిచయం చేయడం కొంచం కష్టంగా మారింది కాని, మేము ఇలా కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇద్దరికి, మేకప్, స్వీయ-సంరక్షణ, గోర్లు చేయడం వంటివి తెలుపుతూ వారిద్దిరలో ఉన్న ఉమ్మడి విషయాలని పంచుకున్నరు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)