Malawi Vice President : మలావీ ఉపాధ్యక్షుడు సౌలస్‌ దుర్మరణం

ఆఫ్రికా దేశమైన మలావీలో సైనిక విమానం అదృశ్యమైన ఘటనలో మలావీ ఉపాధ్యక్షుడు సౌలస్‌ షిలిమా మృతి చెందారు. పర్వత ప్రాంతాల్లో సైనిక విమానం కూలిపోయిందని, ఈ ఘటనలో ఉపాధ్యక్షుడు సౌలస్‌ షిలిమా సహా 10 మంది దుర్మరణం చెందినట్లు ఆ దేశాధ్యక్షుడు లాజరస్‌ చక్వేరా జూన్‌ 11న ప్రకటించారు.

దేశ ఉత్తర భాగంలోని పర్వత ప్రాంతంలో విమానం శకలాలను గుర్తించినట్లు మలావీ అధ్యక్షుడు లాజరస్‌ చక్వేరా మంగళవారం వెల్లడించారు. ఈ దుర్ఘటనలో ఎవరూ ప్రాణాలతో మిగల్లేదని తెలిపారు. ఉపాధ్యక్షుడు షిలిమా సహా మొత్తం 10 మంది సోమవారం ఉదయం సైనిక విమానంలో మలావీ రాజధాని లిలోంగ్వే నుంచి 370 కిలోమీటర్ల దూరంలోని మజుజు సిటీకి బయలుదేరారు. ముజుజులో ప్రతికూల వాతావరణం వల్ల ల్యాండ్‌ అయ్యే అవకాశం లేకపోవడంతో వెనక్కి వెళ్లాలని విమానం పైలట్‌కు ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్స్‌ సమాచారం ఇచ్చారు. 45 నిమిషాల తర్వాత విమానంతో సంబంధాలు తెగిపోయాయి. రాడార్‌ నుంచి విమానం అదృశ్యమైంది.

Central Cabinet : మరో 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం!

#Tags