Sadhna Saxena: ఆర్మీ మెడికల్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ జనరల్‌గా నియమితులైన‌ తొలి మహిళ ఈమెనే..

భారత సాయుధ దళాల జనరల్‌ హాస్పిటల్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌గా లెఫ్టినెంట్‌ జనరల్‌ సాధనా సక్సేనా నాయర్‌ నియమితులయ్యారు.

ఆర్మీ మెడికల్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ జనరల్‌గా(ఈఏ) తొలిసారి నియమితులైన మహిళా ఈమెనే. అలాగే.. వెస్ట్రన్‌ ఎయిర్‌ కమాండ్‌కి ప్రిన్సిపల్‌ మెడికల్‌ ఆఫీసర్‌గా పని చేసిన తొలి మహిళ కూడా సాధనా సక్సేనానే.
సాధనా సక్సేనా పుణెలోని ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ మెడికల్‌ కాలేజీ నుంచి విశిష్ట విద్యా రికార్డుతో డిగ్రీ పొందింది. ఫ్యామిలీ మెడిసిన్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ, తల్లి–పిల్లల ఆరోగ్యంలో డిప్లొమాలతో సహా వివిధ విద్యా అర్హతలు సాధించిన సాధన సక్సేనా న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో మెడికల్‌ ఇన్ఫర్మేటిక్స్‌లో రెండు సంవత్సరాల శిక్షణా కార్యక్రమం పూర్తి చేసింది.

1985లో ఆర్మీ మెడికల్‌ కార్ప్స్‌లో చేరిన సాధనా స్విట్జర్లాండ్‌లోని స్పీజ్‌లో ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్, మిలిటరీ మెడికల్‌ ఎథిక్స్‌తో కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్, న్యూక్లియర్‌ వార్‌ఫేర్‌లో శిక్షణ పొందింది. 

లెఫ్టినెంట్‌ జనరల్‌ నాయర్‌ నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ (ఎన్‌ఈపీ) 2019లోని మెడికల్‌ ఎడ్యుకేషన్‌ కాంపోనెంట్‌లో కొంత భాగాన్ని రూపొందించడానికి ప్రతిష్టాత్మకమైన డాక్టర్‌ కస్తూరి రంగన్‌ కమిటీకి నిపుణులైన సభ్యురాలిగా నామినేట్‌ చేయబడింది. మెరిటోరియస్‌ సర్వీస్‌ కోసం వెస్ట్రన్‌ ఎయిర్‌ కమాండ్, ఎయిర్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌–ఇన్‌–చీఫ్‌ బాధ్యతలు నిర్వహించింది. భారత రాష్ట్రపతిచే విశిష్ట సేవా పతకం పొందింది. ఆమె కుటుంబంలోని మూడు తరాల వారూ గత ఏడు దశాబ్దాలుగా సాయుధ దళాలలో పని చేశారు. 

Paetongtarn Shinawatra: థాయ్‌లాండ్‌ ప్రధానిగా పేటోంగ్‌టార్న్‌ షినవత్ర..

#Tags