High Court judge: ఏ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ రవినాథ్ ప్రమాణం చేశారు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ రవినాథ్ తిల్హరి ప్రమాణం చేశారు. అక్టోబర్ 18న అమరావతిలోని హైకోర్టులో జరిగిన కార్యక్రమంలో తిల్హరి చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణం చేయించారు. అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్‌లో న్యాయమూర్తిగా సేవలందిస్తున్న జస్టిస్ తిల్హరీని ఏపీ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసుకు ఇటీవల రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు.
యాంఫి చైర్మన్‌గా బాలసుబ్రమణియన్
ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఏఎంసీ ఎండీ, సీఈవోగా ఉన్న ఏ.బాలసుబ్రమణియన్.. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) చైర్మన్‌గా నియమితులయ్యారు. ఎడెల్‌వీజ్ ఏఎంసీ ఎండీ, సీఈవో రాధికా గుప్తా.. యాంఫి వైస్ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. కోటక్ ఏఎంసీ ఎండీ నీలేష్‌షా ఇప్పటి వరకు యాంఫి చైర్మన్‌గా వ్యవహరించగా.. వైస్ చైర్‌పర్సన్ బాధ్యతలను ఇన్వెస్కో ఏఎంసీ సీఈవో సౌరభ్ నానావతి చూశారు.
చదవండి: స్టూడెంట్ ప్రైజ్ జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయురాలు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణం
ఎప్పుడు : అక్టోబర్ 18
ఎవరు : జస్టిస్ రవినాథ్ తిల్హరి
ఎక్కడ : ఏపీ హైకోర్టు, అమరావతి, గుంటూరు జిల్లా
ఎందుకు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వల మేరకు...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్