PM Fumio Kishida: ప్రధాని పదవికి రాజీనామా చేయనున్న ఫుమియో కిషిడా!

జపాన్ ప్రధాని పదవికి ఫుమియో కిషిడా రాజీనామా చేయనున్నారు.

సెప్టెంబ‌ర్  నెలలో ప్రధానమంత్రి పదవి నుంచి తప్పుకుంటున్నట్లు అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (ఎల్‌డీపీ) సమావేశంలో వెల్లడించారు.  

ఇటీవల వివాదాస్పద యూనిఫికేషన్ చర్చ్‌తో పార్టీ సంబంధాలు, ఎల్‌డీపీకి విరాళాలతో పాటు ఇతర అంశాలు కిషిడాపై దేశ ప్రజల మద్దతు తగ్గింది. ప్రధానిగా కొనసాగితే మరిన్ని ఇబ్బందులు తప్పవని ముందే గ్రహించిన కిషిడా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

జపాన్‌ అధికార పార్టీ ఎల్‌డీపీకి బాధ్యతలు చేపట్టిన మూడేళ్లలో ప్రధాని పదవికి రాజీనామా చేస్తుండడం, అతని స్థానంలో మరో అభ్యర్ధి ఎంపిక కత్తిమీద సాములా మారింది. జీవన వ్యయాల పెరుగుదల, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, త్వరలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు వంటి అంశాలు కొత్త అభ్యర్ధి ఎంపికపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి.

Mohammad Eslami: ఇరాన్‌ అణు విభాగం చీఫ్‌గా మహ్మద్‌ ఎస్లామీ

#Tags