Israel PM Netanyahu: ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహుపై అరెస్టు వారెంట్..!

ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహుపై అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు(ఐసీసీ) న‌వంబ‌ర్ 21వ తేదీ అరెస్టు వారెంట్లు జారీ చేసింది.

అలాగే ఇజ్రాయెల్‌ రక్షణ శాఖ మాజీ మంత్రి యోవ్‌ గల్లాంట్‌తోపాటు పలువురు హమాస్‌ నేతలపైనా వారెంట్లు జారీ చేసింది. బెంజమిన్, గల్లాంట్‌ గాజాలో మారణహోమం సాగించారని, మానవత్వంతో దాడి చేశారని ఐసీసీ ఆక్షేపించింది. హత్యలు చేయడం, సాధారణ ప్రజలను వేధించడం వంటి అమానవీయ చర్యలకు పాల్పడ్డారని ఆరోపించింది. 

గాజాలో ప్రజలకు ఆహారం, నీరు, ఔషధాలు, విద్యుత్, ఇంధనం, ఇతర నిత్యావసరాలు అందకుండా ఆంక్షలు విధించారని, అమాయకుల మరణానికి కారకులయ్యారని మండిపడింది. నెతన్యాహు, గల్లాంట్‌ చర్యల వల్ల ఎంతోమంది మహిళలు, చిన్నారులు బలయ్యారని ఉద్ఘాటించింది. పౌష్టికాహారం, నీరు అందక, డీహైడ్రేషన్‌తో పసిబిడ్డలు మరణించారని పేర్కొంది. 

Miss Universe 2024: 'విశ్వ సుందరి'గా డెన్మార్క్‌ బ్యూటీ.. ఆమె ఎవ‌రో తెలుసా..?

నెతన్యాహు, గల్లాంట్‌ ఉద్దేశపూర్వకంగానే సామాన్య ప్రజలపై వైమానిక దాడులు చేసినట్లు చెప్పడానికి సహేతుకమైన ఆధారాలను గుర్తించామని వివరించింది. గాజాలో నెలకొన్న మానవతా సంక్షోభానికి నెతన్యాహు, గల్లాంట్‌ బాధ్యత వహించాలని తేల్చిచెప్పింది. యుద్ధ నేరాల్లో నెతన్యాహు నిందితుడని స్పష్టం చేసింది. 

గాజాలో.. 2023 అక్టోబర్‌ 8 నుంచి 2024 మే 20వ తేదీ వ‌ర‌కు నెలకొన్న పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు నెతన్యాహు, గల్లాంట్‌పై అరెస్టు వారెంట్లు జారీ చేసింది. అలాగే గాజాలో భీకర యుద్ధానికి, సంక్షోభానికి కారణమయ్యారంటూ హమాస్‌ నేతలపైనా అరెస్టు వారెంట్లు జారీ అయ్యాయి.

హమాస్‌ అగ్రనేతలు మొహమ్మద్‌ డెయిఫ్, యహ్యా సిన్వర్, ఇస్మాయిల్‌ హనియేను అరెస్టు చేయాలని ఐసీసీ స్పష్టంచేసింది. అయితే, యహ్యా సిన్వర్, ఇస్మాయిల్‌ హనియే ఇప్పటికే ఇజ్రాయెల్‌ దాడుల్లో మృతిచెందారు. 

United States Presidents: ఇప్ప‌టివ‌ర‌కు అమెరికా అధ్యక్షులుగా ఎన్నికైన వారు వీరే..

#Tags