Intelligence Bureau: ఐబీ చీఫ్‌ డేకా పదవీకాలం ఏడాది పొడిగింపు

ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఐబీ) చీఫ్‌ తపన్‌ కుమార్‌ డేకా పదవీ కాలాన్ని మరో ఏడాదిపాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఆయన 2025 జూన్‌ వరకు బాధ్యతల్లో కొనసాగుతారని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ తెలిపింది. జూన్‌ 30వ తేదీన ముగియనున్న డేకా పదవీ కాలాన్ని ఏడాది పాటు పొడిగించేందుకు కేబినెట్‌ నియామ కాల కమిటీ ఆమోదించిందని వెల్లడించింది. 

1988 బ్యాచ్‌ హిమాచల్‌ ప్రదేశ్‌ కేడర్‌ ఐపీఎస్‌ అయిన డేకా 1998లో ఐబీలో చేరారు. 2022 జూలై ఒకటో తేదీన ఆయన ఐబీ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. అలాగే.. జాతీయ మానవహక్కుల కమిషన్‌(ఎన్‌హెచ్‌ఆర్సీ) సెక్రటరీ జనరల్‌ భరత్‌ లాల్‌ పదవీ కాలాన్ని ఏడాదిపాటు పొడిగిస్తూ సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులిచ్చింది.

PK Mishra: ప్రధాని మోదీ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా పీకే మిశ్రా

#Tags