Skip to main content

PK Mishra: ప్రధాని మోదీ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా పీకే మిశ్రా

ప్రధాని మోదీ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా మాజీ ఐఏఎస్‌ పీకే మిశ్రాను కొనసాగిస్తూ సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
PK Mishra to continue as Principal Secretary to Prime Minister Narendra Modi

పీకే మిశ్రా పునర్నియామకం జూన్‌ 10వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది.

అలాగే.. అమిత్‌ ఖరే, తరుణ్‌ కపూర్‌లను ప్రధానమంత్రి సలహాదారులుగా జూన్‌ 10 నుంచి వచ్చే రెండేళ్లపాటు ప్రధాని కార్యాలయంలో మళ్లీ కొనసాగించాలని కేబినెట్‌ నియామకాల కమిటీ నిర్ణయించింది. 
 
గుజరాత్ కేడర్‌కు చెందిన పికె మిశ్రా 1972 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి. ఈయ‌న నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2001 నుంచి 2004 సవ‌త్స‌రం వ‌ర‌కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అలాగే 2014లో మిశ్రా ప్రధాని నరేంద్ర మోదీకి అదనపు ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 

Ajit Doval: జాతీయ భద్రతా సలహాదారుగా మూడోసారి అజిత్‌ దోవల్

Published date : 15 Jun 2024 12:36PM

Photo Stories