Ajit Doval: జాతీయ భద్రతా సలహాదారుగా మూడోసారి అజిత్ దోవల్
పదవీకాలం పూర్తి కావడంతో మళ్లీ ఆయన్నే నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంలో అజిత్ దోవల్ మూడోసారి ఈ బాధ్యతలు చేపట్టారు.
అజిత్ దోవల్ ముఖ్యాంశాలు ఇవే..
➤ 1945 జనవరి 20న జన్మించిన అజిత్ దోవల్ 1968 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఆయన తండ్రి మేజర్ గుణానంద దోవల్ భారత సైన్యంలో అధికారిగా పనిచేశారు.
➤ ఆయన ఉగ్రవాద నిరోధక నిపుణుడిగా పేరు పొందారు. ఎప్పుడూ ప్రధానికి వ్యూహాత్మక ఆలోచనలు, కార్యాచరణ ప్రణాళికలపై సూచనలిస్తుంటారు.
➤ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌లలో రహస్య గూఢచారిగా పని చేసిన ఆయన ఇండియన్ ‘జేమ్స్ బాండ్’గా పేరు పొందారు.
➤ విదేశీ గూఢచార సంస్థ ‘రా’ను నిర్వహిస్తున్నారు.
➤ 2017లో డోక్లామ్ పీఠభూమిలో, 2020లో తూర్పు లడఖ్‌లో చైనా ఆర్మీ దురాక్రమణను ఎదుర్కోవడంలో అజిత్ దోవల్ అత్యంత కీలక పాత్ర పోషించారు.
➤ దోవల్ చైనాతో సరిహద్దు సమస్యను పరిష్కరించడంలో భారత ప్రత్యేక ప్రతినిధిగా వ్యవహరించారు.
➤ పంజాబ్‌లో ఐబీ ఆపరేషనల్ చీఫ్‌గా, కశ్మీర్‌లో అదనపు డైరెక్టర్‌గా పనిచేశారు.