World's First Miss AI: ప్రపంచంలోనే తొలి 'మిస్‌ ఏఐ' కిరీటాన్ని దక్కించుకున్న మొరాకో ఇన్‌ఫ్లుయెన్సర్‌..!

ప్రపంచంలోనే మొదటిసారిగా జరిగిన మిస్ ఏఐ అందాల పోటీలో మొరాకోకు చెందిన కెంజా లైలీ అనే ఇన్‌ఫ్లుయెన్సర్ విజేతగా నిలిచింది.

ఈ పోటీలో దాదాపు 1500 ఏఐ మోడళ్లు పోటీపడ్డాయి. కృత్రిమ మేధస్సు పరంగా అగ్రస్థానంలో నిలిచిన లైలీ ఈ కిరీటాన్ని గెలుచుకుంది. అందుకుగానూ ఆమెను సృష్టించిన మెరియం బెస్సా రూ.16 లక్షల ప్రైజ్‌మనీ గెలుపొందింది. లైలీకి ఇన్‌స్టాగ్రాంలో లక్షలాది మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. 

ఆమె ఆహరం, సంస్కృతి, ఫ్యాషన్‌, అందరం, ట్రావెల్స్‌ వంటి వాటి గురించి కంటెట్‌ ఇస్తుంది. ఈ వర్చువల్‌ పాత్రలో కెంజా లేలీ మొరాకో గొప్ప వారసత్వాన్ని చాటుకుంది. ఆమె సంస్కృతి, సాంకేతికల ప్రత్యేక కలియికను కలిగి ఉంది. ఏడు వేర్వేరు భాషల్లో ఫాలోవలర్లతో 24/7 టచ్‌లో ఉంటంది. 

ఈ ఏఐ మోడల్ తన లక్ష్యం మొరాకో సంస్కృతిని గర్వంగా ప్రదర్శించడమేనని, తన ఫాలోవర్లకు వివిధ రంగాలలో సమాచారం అందించడమేనని చెబుతోంది. పర్యావరణాన్ని రక్షించడానికి సానుకూలమైన రోబోట్ సంస్కృతి గురించి అవగాహన కల్పించాలని కూడా ఆమె ఆకాంక్షిస్తోంది.

ఏఐ అనేది మానవ సామర్థ్యాలను భర్తీ చేయడానికి రూపొందించిన సాధనం మాత్రమేనని, అన్నింటినీ ఇది భర్తీ చేయలేదని కెంజా స్పష్టం చేసింది. మానవులు, ఏఐ సాంకేతికత మధ్య అంగీకారం, సహకారాన్ని ప్రోత్సహించడమే తన లక్ష్యం అని తెలిపింది. తన విజయంపై లైలీ గర్వంగా ఉందని, మొరాకో కోసం ఈ అవార్డును గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పింది.

ఈ పోటీలో ఫ్రాన్స్‌కు చెందిన లాలినా వాలినా రెండో స్థానంలో, పోర్చుగల్‌కు చెందిన ఒలివియా సీ మూడో స్థానంలో నిలిచారు. భారతదేశం నుంచి జారా శతావరీ టాప్‌ 10 ఫైనలిస్ట్‌లో నిలిచినా టైటిల్‌ సాధించలేకపోయింది.

Miss Supranational: మిస్‌ సుప్రానేషనల్‌ టైటిల్‌ని దక్కించుకున్న ఇండోనేషియా బ్యూటీ.. 12వ స్థానంలో నిలిచిన‌ భారతీయురాలు!

#Tags