Hemant Soren: జార్ఖండ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న హేమంత్‌ సోరెన్

జార్ఖండ్ ముఖ్యమంత్రిగా జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) నేత హేమంత్ సోరెన్ న‌వంబ‌ర్ 28వ తేదీ నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన హేమంత్ సోరెన్ న‌వంబ‌ర్ 24వ తేదీన రాష్ట్ర గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్‌ను కలిశారు. ఆయన ప్రభుత్వ ఏర్పాటు కోసం సిద్ధంగా ఉన్నట్లు గవర్నర్‌కు సమాచారం ఇచ్చారు. మద్దతు ప్రకటించిన మెజారిటీ ఎమ్మెల్యేలు అందజేసిన లేఖను కూడా గవర్నర్‌కు సమర్పించారు. ఈ ఆధారంగా గవర్నర్ హేమంత్‌ను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించారు.

అంతకుముందు హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలలో 81 స్థానాలకు గాను ఇండియా కూటమి 56 స్థానాలు గెలుచుకుంది. ఇందులో హేమంత్ సోరెన్ పార్టీ 34 సీట్లు సాధించింది, కాగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కేవలం 24 సీట్లలో ఆగిపోయింది.

హేమంత్ సోరేన్ తొలిసారిగా 2013లో 38 ఏళ్ల వయస్సులో జార్ఖండ్ సీఎం అయ్యారు. అప్పుడు జార్ఖండ్ రాష్ట్రంలో అతిపిన్న వయస్కుడైన సీఎంగా రికార్డు సృష్టించారు. ఆయన ప్రస్తుతం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు.

Priyanka Gandhi: ఘన విజయం సాధించిన‌ ప్రియాంక గాంధీ.. మెజార్టీ ఎంతంటే!

#Tags