Geeta Rao Gupta appointed as US Ambassador: భారత సంతతికి చెందిన గీతారావ్‌ గుప్తాకు కీలక పదవి..

అమెరికా విదేశాంగ శాఖలో అంతర్జాతీయ మహిళా సమస్యల పర్యవేక్షకురాలిగా భారత సంతతికి చెందిన గీతారావ్‌ గుప్తాతో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ ప్రమాణ స్వీకారం చేయించారు.
Geeta Rao Gupta

గీతారావ్‌ నియామకానికి గత మే నెలలోనే యూఎస్ సెనేట్‌ 51 – 47 ఓట్ల తేడాతో ఆమోదం తెలిపింది. 
మహారాష్ట్రలోని ముంబైలో గీతారావ్‌ గుప్తా జ‌న్మించారు. యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, బెంగళూరు యూనివర్సిటీల్లో గీతా రావు విద్యాభ్యాసం చేశారు.బెంగళూరు యూనివర్సిటీ నుంచి సోషల్ సైకాలజీలో ఆమె పీహెచ్‌డీ చేశారు.
ఆమె ఇంతకుముందు ఐక్యరాజ్యసమితి, యునిసెఫ్‌, బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌లలోనూ కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఆర్థిక వ్యవస్థలో మహిళలు సమాన భాగస్వామ్యం పొందకుండా నిరోధిస్తున్న సమస్యలను తొలగించేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా గీతారావ్‌ గుప్తా తెలిపారు.

☛☛​​​​​​​ Aarti Holla-Maini Appointed as Director of UNOOSA: ఐరాస అంతరిక్ష వ్యవహారాల కార్యాలయ డైరెక్టర్‌గా భారత సంతతి మహిళ

#Tags