Vinay Kwatra: అమెరికాలో భారత రాయబారిగా వినయ్ క్వాత్రా
అమెరికాలో భారత రాయబారిగా విదేశీ వ్యవహారాల శాఖ మాజీ కార్యదర్శి వినయ్ క్వాత్రా నియమితులయ్యారు.
జనవరిలో తరణ్‌జిత్ సంధు పదవీ విరమణ చేయడంతో వినయ్ క్వాత్రాను ఎంఈఏ నియమించింది.
ఈయన.. 2022 మే 1 నుంచి 2024 జూలై 14వ తేదీ వరకు విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా పనిచేశారు. 1988లో ఐఎఫ్‌ఎస్ అధికారిగా విధుల్లో చేరిన వినయ్ క్వాత్రా వివిధ హోదాల్లో పనిచేశారు. 1993 నుంచి 2003 వరకు న్యూఢిల్లీలోని విదేశాంగ శాఖ ప్రధాన కార్యాలయంలో ఐక్యరాజ్యసమితి వ్యవహారాలను చూసేవారు. 2015 నుంచి 2017 వరకు ప్రధాని కార్యాలయంలో జాయింట్ సెక్రటరీగా విధులు నిర్వర్తించారు. 2017 ఆగస్టు నుంచి 2020 ఫిబ్రవరి వరకు ఫ్రాన్స్‌లో ఉన్నారు. 2020 మార్చి నుంచి 2022 ఏప్రిల్ వరకు నేపాల్‌లో భారత రాయబారిగా పనిచేశారు.
#Tags