Natwar Singh: కేంద్ర మాజీ మంత్రి నట్వర్ సింగ్‌ కన్నుమూత

మాజీ దౌత్యాధికారి, కాంగ్రెస్ నేత, మాజీ విదేశాంగ మంత్రి కె నట్వర్ సింగ్(93) ఆగ‌స్టు 10వ తేదీ కన్నుమూశారు.

నట్వర్ సింగ్ 1931లో రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాలో జన్మించారు. 1953లో విదేశాంగ శాఖ అధికారిగా కెరీర్ ప్రారంభించారు. చైనా, అమెరికా, పాకిస్తాన్‌, బ్రిట‌న్ త‌దిత‌ర దేశాల్లో కీల‌క హోదాల్లో పనిచేశారు. 

1966 నుంచి 1971 వరకు ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ కార్యాలయంతో పనిచేశారు. 1985లో కేంద్ర ఉక్కు, బొగ్గుగ‌నుల శాఖ స‌హాయ‌మంత్రిగా ఉన్నారు. నట్వర్‌సింగ్‌కు 1984లో పద్మభూషణ్ అవార్డు లభించింది. ఆయన పలు పుస్తకాలు రచించారు.

కాంగ్రెస్ మాజీ ఎంపీ నట్వర్ సింగ్ 2004-05లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ-1 ప్రభుత్వ హయాంలో భారత విదేశాంగ మంత్రిగా వ్యవహరించారు. పాకిస్తాన్‌లో భారత రాయబారిగా కూడా పనిచేశారు.

Buddhadeb Bhattacharya: డీవైఎఫ్‌ఐ కార్యకర్త నుంచి సీఎం స్థాయికి ఎదిగిన బుద్ధదేవ్‌ కన్నుమూత

#Tags