Sean Duffy: అమెరికా రవాణామంత్రిగా ఫాక్స్‌ న్యూస్‌ వ్యాఖ్యాత

అమెరికా రవాణామంత్రిగా ఫాక్స్‌ న్యూస్‌ హోస్ట్‌ సాన్‌ డఫీని నామినేట్‌ చేస్తున్నట్లు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు.

ఫాక్స్‌ న్యూస్‌కు సంబంధించి ట్రంప్‌ యంత్రాంగంలో ఇది రెండో నియామకం. ఫాక్స్‌న్యూస్‌ హోస్ట్‌ పీట్‌ హెగ్సెత్‌ను రక్షణ మంత్రిగా ట్రంప్‌ ఇప్పటికే నామినేట్ చేశారు. డఫీ నియామకాన్ని సెనేట్‌ ఆమోదించాల్సి ఉంటుంది. 
 
రాజకీయాలు, మీడియా, రియాలిటీ, టీవీ రంగాల్లో విస్తరించిన వైవిధ్యమైన కెరీర్‌ ఆయన సొంతం. 1990ల చివర్లో ఎంటీవీ ‘ది రియల్‌ వరల్డ్‌: బోస్టన్‌’లో కాస్ట్‌ మెంబర్‌గా ఆయన అందరి దృష్టిని ఆకర్షించారు. తరువాత ‘రోడ్‌ రూల్స్‌: ఆల్‌ స్టార్స్‌’లో కనిపించారు. 

2010లో విస్కాన్సిన్‌ నుంచి ప్రతినిధుల సభకు ఎన్నికవడంతో డఫీ రాజకీయ జీవితం మొదలైంది. 2019లో రాజీనామా చేసి ఫాక్స్‌ న్యూస్‌ కంట్రిబ్యూటర్‌గా చేరారు. ప్రస్తుతం ఫాక్స్‌ బిజినెస్‌లో ‘ది బాటమ్‌ లైన్‌’ వ్యాఖ్యాతగా ఉన్నారు. 2022లో విస్కాన్సిన్‌ గవర్నర్‌ పదవిని తిరస్కరించారు.

Chris Wright: అమెరికా ఇంధన మంత్రిగా నియమితులైన‌ క్రిస్‌ రైట్

#Tags