Masoud Pezeshkian: ఇరాన్ నూతన అధ్యక్షుడిగా మసూద్ పెజెష్కియాన్

ఇరాన్‌ అధ్యక్ష ఎన్నికల్లో అతివాద అభ్యర్థి సయీద్ జలీలీపై వైద్యుడు(హార్ట్‌ సర్జన్‌) మసూద్ పెజెష్కియాన్ విజయం సాధించారు.

ఇరాన్‌ కొత్త అధ్యక్షుడిగా సంస్కరణవాద అభ్యర్థి మసూద్ పెజెష్కియాన్  ఎన్నికయ్యారు. ఇక, కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు దాదాపు 30 మిలియన్ల ఓట్లు పోలయ్యాయి. జూలై 5వ తేదీ ఎన్నికల తర్వాత అధికారులు సమర్పించిన డేటా పెజెష్కియాన్‌ను 16.3 మిలియన్ ఓట్లతో విజేతగా ప్రకటించగా, జలీలీకి 13.5 మిలియన్ల ఓట్లు వచ్చినట్టు అక్కడి ఎన్నికల అధికారులు తెలిపారు. ఇక, ఎంపీ మసూద్ పెజెష్కియాన్ ఎన్నికల ప్రచారంలో పశ్చిమ దేశాలతో సంబంధాలను బలోపేతం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ప్రజలు మసూద్‌కు భారీ విజయాన్ని అందించారు.

ఇదిలా ఉండగా.. ఇరాన్‌లో ఎవరు ఎన్నికల్లో పోటీ చేయాలన్నది ఆ దేశ గార్డియన్ కౌన్సిల్ నిర్ణయిస్తుంది. నలుగురు అభ్యర్థుల పేర్లను గార్డియన్ కౌన్సిల్ ఆమోదించింది. పెజెష్కియాన్ ఎంపీగానే కాకుండా మహ్మద్ ఖతామీ ప్రభుత్వంలో ఆరోగ్య మంత్రిగా కూడా పనిచేశారు. 1980-89 వరకు డాక్టర్‌గా కొనసాగారు. సయీద్ జలీలీ ఇరాన్ మాజీ చీఫ్ న్యూక్లియర్ నెగోషియేటర్.

Iran Elections: మతవాద పాలనకు ఎదురుదెబ్బ.. అతివాద జలిలిపై ఘన విజయం సాధించిన పెజెష్కియాన్!
#Tags