Anand Mahindra: తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ చైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా

తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే యంగ్ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ చైర్మన్‌గా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా పేరును ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రకటించారు.

అగ్రరాజ్యం అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడించారు. రెండు రోజుల్లో ఆనంద్‌ మహీంద్రా.. వర్సిటీ చైర్మన్‌ బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది.

కాగా రంగారెడ్డి జిల్లా కందుకూరులోని మీర్‌ఖాన్‌పేట్‌లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ (వృత్తి నైపుణ్యాభివృద్ధి) యూనివర్సీటీని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. రూ.100 కోట్లతో 57 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఈ వర్సిటీకి ఆగస్టు 1న సీఎం రేవంత్‌ శంకుస్థాపన చేశారు. ఇందులో 17 రకాల కోర్సుల్లో శిక్షణ ఇచ్చి ప్రైవేటు సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. ఏటా లక్ష మందికి శిక్షణ ఇచ్చేలా రాబోయే కాలంలో ఈ వర్సిటీని ఏర్పాటుచేయ‌నున్నారు.

MLCs: గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కోదండరాం, అమేర్‌ అలీఖాన్

#Tags