PM Narendra Modi: ఎన్డీఏ కూటమి నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రధాని మోదీ

బీజేపీ సారథ్యంలోని అధికార ఎన్డీఏ కూటమి నేతగా ప్రధాని మోదీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఇటీవ‌ల‌ వెలువడ్డ లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ మెజారిటీ స్థానాలు సాధించింది. దాంతో మోదీ వరుసగా మూడోసారి ప్రధాని కానున్నారు. తొలి ప్రధాని నెహ్రూ తర్వాత ఈ ఘనత సాధించనున్న నాయకునిగా రికార్డు సృష్టించనున్నారు.

ఈ నేపథ్యంలో జూన్ 5వ తేదీ ఢిల్లీలో ప్రధాని నివాసంలో ఎన్డీఏ కీలక సమావేశం జరిగింది. మోదీ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో బీజేపీతో పాటు ఎన్డీఏ పక్షాల అగ్ర నేతలంతా పాల్గొన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జేడీ(యూ) చీఫ్‌ నితీశ్‌కుమార్, శివసేన అధినేత ఏక్‌నాథ్‌ షిండే, ఎల్జేపీ (ఆర్‌వీ) చీఫ్‌ చిరాగ్‌ పాశ్వాన్, జేడీ(ఎస్‌) నేత హెచ్‌.డి.కుమారస్వామి, ఎన్సీపీ నాయకుడు ప్రఫుల్‌ పటేల్, జనసేన చీఫ్‌ పవన్‌ కల్యాణ్‌ సహా 16 పార్టీలకు చెందిన 21 మంది నాయకులు భేటీలో పాల్గొన్నారు.

Odisha Election Results: ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ

2014, 2019ల్లోనూ కేంద్రంలో ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పాటైనా ఆ రెండుసార్లూ బీజేపీకి ఒంటరిగానే సంపూర్ణ మెజారిటీ వచ్చింది. ఈసారి మాత్రం ఆ పార్టీ 240 లోక్‌సభ స్థానాలకు పరిమితమై మెజారిటీకి 32 సీట్ల దూరంలో నిలిచింది. దాంతో ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామ్య పక్షాల మద్దతు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో మోదీ 3.0 సర్కారు పనితీరు గత రెండుసార్లతో పోలిస్తే చాలా భిన్నంగా ఉండేలా కనిపిస్తోంది. 

#Tags