Supreme Court: సుప్రీంకోర్టు కొత్త జెండా, చిహ్నాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి

జిల్లా న్యాయ వ్యవస్థపై సెప్టెంబ‌ర్ 1వ తేదీ సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత సుప్రీం కోర్టు యొక్క కొత్త జెండా, చిహ్నాన్ని ఆవిష్కరించారు.

మహిళలపై అత్యాచారం, హత్య వంటి హేయమైన నేరాల విషయంలో తీర్పులు ఇవ్వడంలో కోర్టులు ఎంతమాత్రం జాప్యం చేయొద్దని ముర్ము స్పష్టం చేశారు. సత్వర తీర్పులతో బాధితులకు న్యాయం చేకూర్చాలన్నారు.

కొత్త జెండా ప్రాముఖ్యత ఇదే..
➤ నీలం రంగు, అశోక చక్రం, సుప్రీం కోర్టు భవనం, భారత రాజ్యాంగం వంటి అంశాలు భారతీయ సంస్కృతి, న్యాయ వ్యవస్థ యొక్క లోతైన సంబంధాన్ని తెలియజేస్తాయి.
➤ జెండా న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్రత, సమగ్రతను ప్రతిబింబిస్తుంది.
➤ ఈ కొత్త జెండా ప్రజలలో న్యాయ వ్యవస్థ పట్ల నమ్మకాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది.
➤ ఈ కొత్త జెండా భారతీయ న్యాయ వ్యవస్థ యొక్క భవిష్యత్తు కోసం ఒక దృష్టిని అందిస్తుంది.

Union Cabinet: మూడు నిర్ణయాలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం.. అవి ఏవంటే..

#Tags