New Climate Resilient: నూతన వంగడాలను ఆవిష్కరించిన ప్రధాని మోదీ..

కరువు కాటకాలను, నీటి ఎద్దడి పరిస్థితులను తట్టుకుంటూనే అధిక దిగుబడినిచ్చే నూతన వంగడాలను ప్రధానమంత్రి న‌రేంద్ర‌మోదీ ఆవిష్కరించారు.

వీటిలో 61 పంటలకు సంబంధించిన 109 రకాల విత్తనాలున్నాయి. వీటిలో 34 ఆహార, వాణిజ్య పంటల వంగడాలు కాగా 27 ఉద్యాన పంటలకు చెందినవి. వ్యవసాయ, ఉద్యాన పంటల్లో ఉత్పాదకత, రైతుల ఆదాయాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ వంగడాలను భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్‌) అభివృద్ధి చేసింది. 

పప్పు ధాన్యాలు, తృణధాన్యాలు, నూనె గింజలు, చెరకు, పత్తి, మొక్కజొన్న, పూలు, పండ్లు, కూరగాయలు, దినుసులు, ఔషధ గుణాల మొక్కల విత్తనాలు ఇలా పలురకాల నూతన వంగడాలను ఢిల్లీలోని పూసా క్యాంపస్‌లోని మూడు వ్యవసాయ పరిశోధనా కేంద్రాల్లో ప్రధాని వీటిని ఆవిష్కరించారు. 
 
తృణధాన్యాల గొప్పదనం, సహజ వ్యవసాయంతో కలిగే ప్రయోజనాలను, సేంద్రియ వ్యవసాయంపై సామాన్యుల్లో పెరుగుతున్న అవగాహన గురించి కూడా  మోదీ మాట్లాడారు. ఏటా పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా వ్యవసాయానికి అదనపు విలువ జోడింపు ప్రస్తుతం తక్షణ అవసరమన్నారు. ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తున్న నూతన వంగడాలపై దేశవ్యాప్తంగా కృషి విజ్ఞాన్‌ కేంద్రాలు రైతులకు అవగాహన పెంచాల‌ని మోదీ అన్నారు.

Railway Projects: ఎనిమిది కొత్త రైల్వేలైన్‌ ప్రాజెక్టులకు గ్రీన్‌సిగ్నల్.. తెలుగు రాష్ట్రాల్లో..

#Tags