PM Drive Scheme : పీఎం ఈ–డ్రైవ్ స్కీమ్‌కు ఆమోదం..
కేంద్ర ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాటు అమలు చేసిన ఫ్లాగ్‌షిప్ ఫేమ్ ప్రోగ్రామ్ స్థానంలో భారత్ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు రూ.10,900 కోట్లతో పీఎం ఈ–డ్రైవ్ స్కీమ్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పీఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్‌హాన్స్‌మెంట్ పథకంపై నిర్ణయం తీసుకున్నట్లు సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
Vande Bharat Trains: ఆరు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
ఈ పథకం 24.79 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, 3.16 లక్షల ఈ–త్రీ వీలర్స్, 14,028 ఈ–బస్సులకు సపోర్ట్ ఇవ్వనున్నది. ఈ పథకాలకు మొత్తంగా రూ.14 వేల కోట్లకుపైగా కేటాయించింది. పీఎం ఇ-డ్రైవ్ పథకం కింద అంబులెన్సులు, ఇతర వాహనాలకు సబ్సిడీలు అందించనుంది. ఇందుకు రూ.3679 కోట్లు కేటాయించింది.