PAN 2.0 Project: కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం.. రూ.1435 కోట్లతో పాన్ 2.0 ప్రాజెక్ట్‌

పాన్ కార్డుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించింది.

పాన్‌ 2.0 ప్రాజెక్టు ద్వారా పాన్‌కార్టు ఆధునికీకరణకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్‌కు రూ.1,435 కోట్ల బడ్జెట్‌ను ఆమోదం తెలిపింది.  ప్రధానంగా పన్ను చెల్లింపుదారులకు మెరుగైన సర్వీసులు అందించడం, సాంకేతికత ఆధారిత మార్పులను తీసుకురావడం లక్ష్యంగా ఉంది.

పాన్ 2.0 ప్రాజెక్టు ముఖ్య విశేషాలు ఇవే.. 

కామన్ బిజినెస్ ఐడెంటిఫైర్: పాన్ 2.0 ప్రాజెక్టు పాన్, ట్యాన్ (TAN), టిన్ (TIN) వంటి వ్యవహారాలన్నిటిని ఒకే వేదికపై లింక్ చేయడానికి "కామన్ బిజినెస్ ఐడెంటిఫయర్"ను ప్రవేశపెడుతుంది. దీని ద్వారా వ్యాపారాలు, పన్ను సంబంధిత వ్యవహారాలు మరింత సమర్ధవంతంగా నిర్వహించబడతాయి.

టాక్స్ పేయర్ రిజిస్ట్రేషన్‌లో సాంకేతిక మార్పులు: పన్ను చెల్లింపుదారుల రిజిస్ట్రేషన్ సిస్టమ్స్ సాంకేతిక ఆధారిత మార్పులకు లోబ‌డి ఉంటుంది. దీని ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత సులభం, వేగవంతం అవుతుంది.

క్యూఆర్ కోడ్‌తో కొత్త పాన్ కార్డులు: కొత్తగా జారీచేసే పాన్ కార్డులు క్యూఆర్ కోడ్‌ను కలిగి ఉంటాయి. ఇది క్విక్ అండ్ ఇజీ యాక్సెస్‌ను అందిస్తుంది, తద్వారా పన్ను చెల్లింపుదారులు తమ పాన్ వివరాలను సులభంగా పొందగలుగుతారు.

Cheetah Project: రాజస్థాన్, మధ్యప్రదేశ్ మధ్య చిరుత కరిడార్ మేనేజ్‌మెంట్ కమిటీ

సురక్షిత, పటిష్ట సైబర్ సెక్యూరిటీ: పాన్ 2.0 ద్వారా డేటా భద్రత పెరిగిపోతుంది, తద్వారా పన్ను సంబంధిత సమాచారాన్ని మరింత సురక్షితంగా నిర్వహించవచ్చు.

సులభతర, వేగవంతమైన సేవలు: పాన్ 2.0, పన్ను చెల్లింపుదారులకు మెరుగైన నాణ్యతతో మరియు వేగవంతంగా సేవలను అందించేందుకు సహాయపడుతుంది.

స్పీడీ సర్వీస్ డెలివరీ: పాన్ 2.0 ద్వారా టాక్స్పేయర్ సేవలు వేగంగా అందించబడతాయి.

పటిష్ట సైబర్ సెక్యూరిటీ: పాన్ 2.0 ద్వారా డేటా భద్రత మరింత పటిష్టం చేయబడుతుంది.

Indian Startup: భార‌త్‌లో ప్రస్తుతం 1.53 లక్షలకు పైగా స్టార్టప్‌లు.. ఈ రాష్ట్రాల్లో..

#Tags