Union Budget: ఆర్థిక బడ్జెట్‌కు ఆమోదముద్ర వేసిన లోక్‌సభ

ఆర్థిక సంవత్సర బడ్జెట్‌కు ఆగ‌స్టు 5వ తేదీ లోక్‌సభ ఆమోదముద్ర వేసింది.

ఇటీవ‌ల‌ బడ్జెట్‌పై చర్చ ముగిశాక తాజాగా పార్లమెంట్‌ దిగువసభ తన ఆమోదం తెలిపింది. దీంతోపాటు సభ ఆమోదించిన బడ్జెట్‌ పద్దుల మేరకు సంచిత నిధి నుంచి మొత్తాలను వినియోగించేందుకు అనుమతించే ద్రవ్య వినిమయ బిల్లుకు లోక్‌సభ ఆమోదముద్ర వేసింది.

రైల్వే, విద్య, ఆరోగ్యం, మత్స్యరంగాలకు సంబంధించిన గ్రాంట్‌ల వినియోగానికి సంబంధిన బిల్లుకూ లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా ప్రతిపాదించిన పన్ను శ్లాబుల సంబంధ ఫైనాన్స్‌ బిల్లుపై లోక్‌సభలో చర్చ జరగనుంది.

రాజ్యసభలో వ్యవసాయం, పునరుత్పాదక శక్తి, సహకార రంగం, గృహ పట్టణాభివృద్ధికి కేటాయింపులపై చర్చ జరగనుంది. ఫైనాన్స్‌ బిల్లుపై రాజ్యసభలో చర్చ జరిగినా మార్పులు సిఫార్సు చేయబోదు. కేవలం ఆ బిల్లులను తిరిగి లోక్‌సభకు పంపగలదు. ఫైనాన్స్‌ బిల్లు ఆమోదం పొందాక బడ్జెట్‌ తంతు మొత్తం ముగుస్తుంది.  

Skill Loan Scheme: ‘స్కీమ్‌ ఫర్‌ స్కిల్లింగ్‌’ పేరుతో కొత్త పథకం.. ఆయా ట్రేడ్స్‌లో యువతకు శిక్షణ

ఉద్యానవనాల కోసం రూ.18వేల కోట్లు..
రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా వచ్చే ఐదేళ్లలో ఎగుమతి కోసం ఉద్దేశించి 100 ఉద్యానవనాల క్లస్టర్ల ఏర్పాటు కోసం మొత్తంగా రూ.18,000 కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్ రాజ్యసభలో చెప్పారు. వంటనూనెల దిగుమతి వ్యయం తగ్గించుకోవడంతోపాటు దేశీయంగా నూనెగింజల దిగుబడి పెంచేందుకు రూ.6,800 కోట్లను ఆయిల్‌సీడ్‌ మిషన్‌కు కేటాయిస్తున్నట్లు చౌహాన్‌ వెల్లడించారు. స్వాతంత్య్ర సిద్ధించాక సేద్యరంగం బాగు కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వాలు చేసిందేమీలేదని వ్యాఖ్యానించారు. 

Skill Development : బడ్జెట్‌లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి.. ఇంటర్న్‌షిప్‌ పెంచే విధంగానూ..

#Tags