Religion Conversions : బలవంతపు మతమార్పిడికి మరింత పెరిగిన శిక్షలు.. ఇకపై మరిత కఠినంగా!
Sakshi Education

చట్ట విరుద్ధ మతమార్పిడి (సవరణ బిల్లు)–2024కు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. శిక్షలను మరింత పెంచారు. మోసపూరితంగా, బలవంతంగా మతమార్పిడిలకు పాల్పడినట్టు తేలితే యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తారు. గతంలో ఈ చట్టం కింద గరిష్టంగా పదేళ్ల శిక్ష, రూ.50 వేల జరిమానా ఉండేది. ఒక వ్యక్తి బెదిరించినా, దాడి చేసినా, పెళ్లి చేసుకున్నా, పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేసినా, మత మార్పిడి ఉద్దేశంతో మహిళ, మైనర్‌ను అక్రమ రవాణా చేసినా ఈ చట్టాన్ని ప్రయోగిస్తారు.
Child Marriages : బాల్య వివాహాల నిషేదిక చట్టంపై కేరళా హైకోర్టు తీర్పు..
Published date : 06 Aug 2024 03:45PM