Raising Crops: గణనీయంగా పెరిగిన‌ పంటల సాగు.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా..

దేశ వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పంటల సాగు గణనీయంగా పెరిగిందని కేంద్ర వ్యవసాయ శాఖ పేర్కొంది.

గతేడాదితో పోలిస్తే ఈసారి ఖరీఫ్ పంటల సాగు 2.2 శాతం మేర పెరిగిందని తెలిపింది. గతేడాది 10.69 కోట్ల హెక్టార్లలో పంటలు సాగవ్వగా, ఈ ఏడాది సెప్టెంబర్ 6వ తేదీ నాటికి 10.92 కోట్ల హెక్టార్లలో పంటల సాగు జరిగిందని పేర్కొంది. గత ఏడాదితో పోలిస్తే వరి సాగు 3.53 కోట్ల హెక్టార్ల నుంచి 4 శాతం మేర పెరిగి 4.09 కోట్ల హెక్టార్లకు చేరిందని వెల్లడించింది. 

పప్పుధాన్యాల సాగు సైతం 1.17 కోట్ల హెక్టార్ల నుంచి 1.26 కోట్ల హెక్టార్లకు అంటే 7.5% పెరగ్గా, నూనె గింజల సాగు 1.89 కోట్ల హెక్టార్ల నుంచి 1.92 కోట్ల హెక్టార్లకు చేరిందని వెల్లడించింది. అయితే.. పత్తి సాగు మాత్రం అధిక వర్షాల కారణంగా 1.23 కోట్ల హెక్టార్ల నుంచి 1.10 కోట్ల హెక్టార్లకు, 9% మేర తగ్గిం దని వివరించింది. 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగైనా భారీ వర్షాలు, వరదల కారణంగా దిగుబడి మాత్రం తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆయా రాష్ట్రాల్లో వాటిల్లిన పంట నష్టంపై అంచనాలు సిద్ధం కాలేదని తెలిపింది.

Navratna Status: నాలుగు సంస్థలకు నవరత్న హోదా.. ఏ కంపెనీలకంటే..

#Tags