Mumbai Samachar: ‘ముంబై సమాచార్–200 నాటౌట్’ డాక్యుమెంటరీ విడుదల
ఈ ప్రయాణంలో గుజరాతీ వార్తా పత్రిక ‘ముంబై సమాచార్’ పాత్ర ప్రశంసనీయమని పేర్కొన్నారు. ‘ముంబై సమాచార్–200 నాటౌట్’ డాక్యుమెంటరీ విడుదల సందర్భంగా సెప్టెంబర్ 8వ తేదీ ముంబైలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు.
ఆసియాలోనే అత్యంత పురాతన వార్తా పత్రిక..
ఈ డాక్యుమెంటరీ ఏకకాలంలో 40 దేశాల్లో విడుదలైంది. 200 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ముంబై సమాచార్ ఆసియాలోనే అత్యంత పురాతన వార్తా పత్రికగా నిలిచింది. విశ్వసనీయత కలిగిన జర్నలిజానికి ‘కామా’ కుటుంబం మారుపేరుగా నిలిచిందని అమిత్ షా కొనియాడారు. స్వాతంత్య్ర ఉద్యమంలో పోషించిన పాత్ర, నిష్పాక్షిక రిపోర్టింగ్ పత్రిక నిబద్ధతకు, శాశ్వత విజయాలకు రహస్యాలని పేర్కొన్నారు. అందులో వచ్చే ప్రతి వార్తా నిజమేనని జనం నమ్మేవారన్నారు.
Swachh Vayu Survekshan: స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ 2024 ఫలితాలు.. టాప్‌లో ఉన్న నగరాలు ఇవే..