Monkeypox RT-PCR Kit: దేశంలోనే తొలిసారి మంకీపాక్స్‌ ఆర్టీ-పీసీఆర్‌ కిట్‌ తయారీ

'మంకీపాక్స్' అనేది ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న వ్యాధి.

ఈ క్రమంలో భార‌త‌దేశంలోనే తొలిసారి విశాఖపట్నంలోని ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ టెక్నాలజీ జోన్‌ (ఏఎంటీజెడ్‌) మరోసారి తన సత్తాను చాటింది. తమ భాగస్వామి సంస్థ ట్రాన్సేషియా డయాగ్నస్టిక్స్‌తో కలిసి ఎంపాక్స్‌ (మంకీపాక్స్‌) వ్యాధిని నిర్ధారించే ఆర్టీ-పీసీఆర్‌ కిట్‌ను విజయవంతంగా అభివృద్ది చేసింది.

ఈ కిట్‌ను ఎర్బాఎండీఎక్స్‌ మంకీపాక్స్‌ ఆర్టీ-పీసీఆర్‌ పేరుతో విడుదల చేశారు. ఇది ఎంపాక్స్‌ వ్యాధిని నిర్ధారించే దేశీయంగా రూపొందించిన తొలి టెస్టింగ్ కిట్‌గా నిలిచింది.

ఈ కిట్‌కు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) ధ్రువీకరణతో పాటు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్‌ డ్రగ్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ నుంచి అత్యవసర అనుమతులు లభించాయి. ఈ కిట్ రెండు వారాల్లో మార్కెట్‌లోకి అందుబాటులోకి రానుంది.

Maternity Leave: మహిళా ఉద్యోగులకు స్పీడ్‌ బ్రేకర్లుగా మారుతున్న ప్రసూతి సెలవులు!!

ఈ విజయం భారతదేశం ప్రపంచ ఆరోగ్య ఆవిష్కరణల్లో ముందంజలో ఉందని, ఇది ఆరోగ్య రంగంలో భారతీయ ప్రతిభకు నిదర్శనమని మెడ్‌టెక్‌ జోన్‌ సీఈఓ డా.జితేంద్ర శర్మ అన్నారు.

కొవిడ్‌ మహమ్మారి సమయంలో మెడ్‌టెక్‌ జోన్‌ ఆరోగ్య రంగానికి అనేక అవసరమైన ఉత్పత్తులను అందించింది. రోజుకు ఒక మిలియన్‌ ఆర్టీపీసీఆర్‌ కిట్లు, 500 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు, 100 వెంటిలేటర్లు ఇక్కడ తయారయ్యాయి.

#Tags