Mpox Virus: భారత్‌లో నమోదైన ఎంపాక్స్‌ క్లేడ్‌ 1బీ తొలి కేసు!

ప్రపంచంలో ‘ఆరోగ్య అత్యయిక స్థితి’కి దారితీసిన ‘క్లేడ్‌1’ వేరియంట్‌ ఎంపాక్స్‌ వైరస్‌ భారత్‌లోకి అడుగుపెట్టింది.

క్లేడ్‌ 1బీ పాజిటివ్‌ కేసు భారత్‌లో నమోదైందని సెప్టెంబ‌ర్ 23వ తేదీ అధికారిక వర్గాలు వెల్లడించాయి. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ నుంచి కేరళకు తిరిగొచ్చిన 38 ఏళ్ల వ్యక్తిలో క్లేడ్‌ 1బీ వైరస్‌ను గుర్తించామని అధికారులు ప్రకటించారు. మలప్పురం జిల్లాకు చెందిన ఈ రోగి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని తెలుస్తోంది. 

క్లేడ్‌ 1బీ వేరియంట్‌ కేసులు విజృంభించడతో ఆగస్ట్‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థ పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటించింది. విదేశాల నుంచి వస్తూ ఎంపాక్స్‌ రకం వ్యాధి లక్షణాలతో బాధపడేవారు తక్షణం ఆరోగ్య శాఖకు వివరాలు తెలపాలని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్‌ సూచించారు.  

కోలుకున్న ‘క్లేడ్‌2’ రోగి  
క్లేడ్‌2 వేరియంట్‌తో ఢిల్లీలోని లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న 26 ఏళ్ల రోగి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యాడని ఆస్పత్రి వర్గాలు  వెల్లడించాయి. హరియాణాలోని హిసార్‌కు చెందిన ఈ వ్యక్తి సెప్టెంబర్‌ ఎనిమిదో తేదీన ఆస్పత్రిలో చేరాడు.

MonkeyPox Cases: 'మంకీపాక్స్‌'పై WHO హెచ్చరిక.. అప్రమత్తమైన కేంద్రం

#Tags