Cleanest City in India: పరిశుభ్ర నగరాల్లో ఇండోర్‌ నెంబర్‌ వన్‌

స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డుల్లో మరోసారి ఇండోర్‌ సత్తా చాటింది. వరుసగా ఆరోసారి అగ్రస్థానంలో నిలిచింది. దేశంలోనే అత్యంత పరిశుభ్ర నగరాల జాబితాలో తొలి స్థానంలో నిలిచింది. ఈ ఏడాదికి ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డుల్లో వరుసగా ఆరోసారీ అగ్రస్థానం కైవసం చేసుకుంది. ఈ జాబితాలో సూరత్, నవీ ముంబయి రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. రాష్ట్రాల జాబితాలో మధ్యప్రదేశ్‌ అగ్రస్థానంలో నిలవగా.. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.

  • లక్షలోపు జనాభా కలిగిన నగరాల జాబితాలో మహారాష్ట్రలోని పంచ్‌గని తొలి స్థానంలో నిలిచింది.ఛత్తీస్‌గఢ్‌లోని పటాన్‌ (ఎన్‌ పీ), మహారాష్ట్రలోని కర్హాడ్‌ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.
  • లక్షకు పైగా జనాభా కలిగిన గంగా నగరాల జాబితాలో..హరిద్వార్‌ తొలి స్థానంలో నిలవగా వారణాశి,రిషికేశ్‌ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.
  • లక్ష కంటే తక్కువ జనాభా కలిగిన గంగా నగరాల జాబితాలో బిజ్నౌర్, కన్నౌజ్, గుర్హుముక్తేశ్వర్‌ టాప్‌ 3లో చోటు దక్కించుకున్నాయి.
  • మహారాష్ట్రలోని దేవ్‌లాలి అత్యంత పరిశుభ్ర కంటోన్మెంట్‌బోర్డుగా తొలి స్థానం దక్కించుకుంది.
     

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

#Tags