Snow Leopards: దేశంలో 718 మంచు చిరుతలు

దేశంలో మొత్తం 718 మంచు చిరుతలు ఉన్నట్లు ‘వైల్డ్‌లైఫ్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా’ తొలిసారి నిర్వహించిన శాస్త్రీయ గణనలో తేలిందని కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్‌యాదవ్‌ తెలిపారు.

జనవరి 30న న్యూఢిల్లీలో జరిగిన ‘నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ వైల్డ్‌లైఫ్‌’ సమావేశంలో ఈ మేరకు ఆయన ఓ నివేదికను విడుదల చేశారు. దేశంలో మంచు చిరుతలు నివసించే 1.20 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో(లద్దాక్, జమ్ముకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌) 70 శాతానికి పైగా ప్రదేశాన్ని ఈ శాస్త్రీయ గణన కవర్‌ చేసిందని కేంద్రం తెలిపింది. 2019 నుంచి 2023 వరకు నాలుగేళ్లపాటు మంచు చిరుతల శాస్త్రీయ గణన జరిగింది. మొత్తం 1971 ప్రాంతాల్లో 1.80 లక్షల ట్రాప్‌ కెమెరాలను ఏర్పాటు చేసి మంచు చిరుతలను లెక్కించారు. మంచు చిరుతల సంఖ్యకు సంబంధించి కేంద్రం తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం–దేశంలో మొత్తం 718 మంచు చిరుతలు ఉన్నాయి. అందులో అత్యధికంగా లద్దాక్‌లో 477 చిరుతలు ఉన్నట్లు తేలింది. అదేవిధంగా ఉత్తరాఖండ్‌లో 124, హిమాచల్‌ప్రదేశ్‌లో 51, అరుణాచల్‌ప్రదేశ్‌లో 36, సిక్కింలో 21, జమ్ము అండ్‌కశ్మీర్‌లో 9 మంచు చిరుతలు ఉన్నాయి.

చదవండి: MQ 9B Drones: భారత సైన్యంలోకి అత్యాధునిక ఎంక్యూ–9బీ డ్రోన్స్‌

#Tags