Ban on LTTE: ఎల్‌టీటీఈపై నిషేధాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగింపు..!

కేంద్ర హోంశాఖ మే 14న ఈ సంస్థపై విధించిన నిషేధం గురించి ప్ర‌భుత్వం ఉత్తర్వులు జారీ చేసింది..

సాక్షి ఎడ్యుకేష‌న్‌: శ్రీలంకకు చెందిన లిబరేషన్‌ టైగర్స్‌ ఆఫ్‌ తమిళ ఈలం (ఎల్‌టీటీఈ) సంస్థపై విధించిన నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఐదేళ్లపాటు పొడిగించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మే 14న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజల్లో వేర్పాటువాద ధోరణిని పెంపొందించడం, ముఖ్యంగా తమిళనాడులో దేశ ప్రాదేశిక సమగ్రతకు ముప్పు కలిగించేలా మద్దతు స్థావరాలను పెంచుకున్న ఎల్‌టీటీఈపై గతంలో విధించిన నిషేధాన్ని కేంద్రం పొడిగించింది. ఎల్‌టీటీఈకి భారత భూభాగంలో మద్దతుదారులు, సానుభూతిపరులు, ఏజెంట్లు ఉన్నారని హోంశాఖ పేర్కొంది.

Dengue Vaccine: డెంగీ టీకాకు అనుమతించిన డబ్ల్యూహెచ్‌వో

#Tags