Air Quality Life Index: వాయు కాలుష్యంతో ప్రజల ఆయుర్దాయం ఎన్నేళ్లు తగ్గుతోంది?

భారత్‌లో ప్రమాదకరంగా పెరిగిపోతున్న వాయు కాలుష్యం ప్రజల ఆయుర్దాయాన్ని తగ్గిస్తోంది.

కాలుష్యంతో నిండిన గాలి పీల్చడం వల్ల  దేశ ప్రజల సగటు ఆయుష్షు తొమ్మిదేళ్లు తగ్గిపోతుందని అమెరికాలోని చికాగో యూనివర్సిటీ ఎయిర్‌ క్వాలిటీ లైఫ్‌ ఇండెక్స్‌(ఏక్యూఎల్‌ఐ) నివేదిక వెల్లడిస్తోంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో తొమ్మిదేళ్లకు అదనంగా మరో 2.5 నుంచి 2.9 ఏళ్లు వయసు తగ్గిపోతుందని తాజాగా విడుదలైన ఆ నివేదిక హెచ్చరించింది. 2019లో అమెరికా యూనివర్సిటీ నిర్వహించిన సర్వే ప్రకారం భారత్‌లో కాలుష్యం ప్రతీ క్యూబిక్‌ మీటర్‌ గాలిలో  70.3 మైక్రోగ్రామ్‌ కాలుష్య కారకాలు ఉన్నాయని తేలింది.

దక్షిణాసియాకు అధిక ముప్పు...
వాయు కాలుష్యంలో దక్షిణాసియా దేశాలైన భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్‌లు ప్రపంచంలోనే అధిక ముప్పుని ఎదుర్కొంటున్నాయని ఏక్యూఎల్‌ఐ నివేదికలో వెల్లడైంది. ఈ దేశాలు కాలుష్యం తగ్గించుకోగలిగితే సగటు వ్యక్తి ఆయుర్దాయం మరో 5,6 ఏళ్లు పెరుగుతుందని నివేదిక అంచనా వేసింది. ఈ దేశాల్లో కిటకిటలాడే జనాభా, అధిక జనసాంద్రత, 2000 నాటితో పోలిస్తే వాహనాల సంఖ్య నాలుగింతలు పెరగడం, సంప్రదాయ ఇంధనాల మీదే ఆధారపడడం వంటివి కాలుష్యం పెరిగిపోవడానికి కారణాలుగా ఉన్నాయి. పంటల దగ్ధం, ఇటుకలు కాల్చడం, ఇతర పారిశ్రామిక కార్యకలాపాలు గాలిని కలుషితం చేస్తున్నాయి.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
భారతదేశ ప్రజల సగటు ఆయుష్షు తొమ్మిదేళ్లు తగ్గిపోతుంది
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 1
ఎవరు    : అమెరికాలోని చికాగో యూనివర్సిటీ ఎయిర్‌ క్వాలిటీ లైఫ్‌ ఇండెక్స్‌(ఏక్యూఎల్‌ఐ) నివేదిక 
ఎందుకు  : కాలుష్యంతో నిండిన గాలి పీల్చడం వల్ల...
 

#Tags