Agricultural: తెలంగాణలో వ్యవసాయ డేటా ఎక్సే్ఛంజి

దేశంలోనే తొలిసారిగా వ్యవసాయ డేటా ఎక్సే్ఛంజి(ఏడీఈఎక్స్‌)ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నట్లు బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ సై¯ŒlÞ(ఐఐఎస్‌సీ) ప్రకటించింది. ఇండియా అర్బన్‌ డేటా ఎక్సే్ఛంజి (ఐయూడీఎక్స్‌)ని కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖతో కలిసి ఇప్పటికే ఐఐఎస్‌సీ ఏర్పాటు చేసింది. పట్టణ ప్రాంతాల ప్రజలకు ఇది ప్రయోజనకరంగా ఉన్నట్లు తెలిపింది. ఇదే రీతిలో ఏడీఈఎక్స్‌ను రైతులకు అనేక సేవలందించే వేదికలా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నట్లు పేర్కొంది. విత్తనాల లభ్యత, పంటల సాగుకు సలహాలు, సూచనలు, బీమా తదితర సేవలు దీనిద్వారా అందించాలనేది ప్రణాళిక. ప్రయోగాత్మక ప్రాజెక్టుగా 2023లో నిర్దేశిత సేవలను దీని ద్వారా అందిస్తామని వెల్లడించింది.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

#Tags