Healthy Snacking Report: ఆరోగ్యకరమైన స్నాక్స్‌ వైపు మొగ్గు చూపుతున్న భారతీయులు!

మార్కెట్‌లో స్నాక్స్‌ కొనేటప్పుడు అందులో ఏం పదార్థాలు వాడారో అని 73 శాతం మంది భారతీయులు చదువుతున్నారని హెల్తీ స్నాకింగ్‌ రిపోర్ట్‌–2024 సర్వే తెలిపింది.

దేశవ్యాప్తంగా 6 వేల మందిపై సర్వే నిర్వహించి నివేదికను జూలై 7వ తేదీ విడుదల చేసింది. వీరిలో 93 శాతం మంది ఆరో గ్యకరమైన ఆహార పదార్థాలను ఎంచుకోవడానికే ఇష్టపడుతున్నారని తెలిపింది. ఆహార కల్తీకి సంబంధించి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సుగంధ ద్రవ్యాలు, స్వీట్స్, ఇతర స్నాక్స్‌ ప్యాకెట్స్‌ కొనుగోలుదారులపై సర్వే నిర్వహించింది. 

ప్రతి 10 మందిలో 9 మంది సంప్రదాయ చిరుతిళ్లకు బదులుగా ఆరోగ్యకరమైన స్నాక్స్‌ కొనాలని చూస్తున్నారని తెలిపింది. డ్రైఫ్రూట్స్, నట్స్, తృణధాన్యాలతో చేసిన సహజమైన ఉత్పత్తులను కొనడానికి ఇష్టపడుతున్నారని తెలిపింది. డ్రై ఫ్రూట్స్, తామర గింజలతో చేసిన పేలాల (మఖనా)ను హెల్తీ స్నాక్‌గా గుర్తించారు. పోషకాలు అత్యధికంగా ఉన్న వీటిని కొనడానికి 67 శాతం మంది భారతీయులు ఆసక్తి చూపుతున్నారని సర్వే వెల్లడించింది.

Zika Virus: జాగ్ర‌త్త‌.. కలకలం రేపుతున్న జికా వైరస్‌.. రాష్ట్రాలకు కేంద్రం సూచ‌న‌లు

#Tags