Project Tiger: ‘ప్రాజెక్ట్‌ టైగర్‌’కు 50 ఏళ్లు..

దేశంలో పులుల సంరక్షణ, తగ్గిపోతున్న పులుల సంఖ్యను పెంచేందుకు భారత ప్రభుత్వం ఏప్రిల్ 1, 1973న ప్రాజెక్ట్ టైగర్‌ను ప్రారంభించింది.

ఈ ప్రాజెక్టు టైగర్ ఏర్పాటై ఇప్ప‌టికి 50 ఏళ్లు పూర్తయింది. ఈ ప్రాజెక్ట్‌ 18, 278 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 9 టైగర్ రిజర్వ్ లను కలిగి ఉంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పులుల సంఖ్య‌లో 70 శాతం మన భారతదేశంలోనే ఉన్నాయి.ప్రాజెక్టు టైగర్‌ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్ణాటకలో బందిపూర్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌లో పర్యటించారు. పశ్చిమ కనుమల్లో ఉన్న ఈ అభయారణ్యంలో ఓపెన్‌ జీపులో దాదాపుగా 20 కి.మీ. దూరం ప్రయాణించి ప్రకృతి అందాలను తిలకించారు. అనంత‌రం పులుల గణన డేటాను విడుద‌ల చేశారు.

Weekly Current Affairs (International) Bitbank: "అక్రమ వలసదారుల నిరోధ‌క‌ బిల్లు"ను ఏ దేశం ప్రవేశపెట్టింది?

అమృత్‌ కాల్‌ కా టైగర్‌ విజన్ బుక్‌లెట్ విడుదల
ఈ సంద‌ర్భంగా మైసూరులోని కర్ణాటక స్టేట్‌ ఓపెన్‌ వర్సిటీలో జరిగిన కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. ‘ఇంటర్నేషనల్‌ బిగ్‌ క్యాట్‌ అలియెన్స్‌(ఐబీసీఏ)’ ప్రాజెక్టును ప్రారంభించారు. వచ్చే 25 ఏళ్లలో పులుల సంరక్షణకు చేపట్టబోయే చర్యలతో ‘అమృత్‌ కాల్‌ కా టైగర్‌ విజన్‌’ బుక్‌లెట్‌ను విడుదల చేశారు. వన్యప్రాణుల సంరక్షణ ప్రపంచదేశాలు చేపట్టాల్సిన అతి ముఖ్యమైన అంశమని చెప్పారు. దేశంలో పులుల తాజా గణాంకాలను ఈ సందర్భంగా మోదీ వెల్లడించారు. 2022 నాటికి దేశంలో పెద్ద పులుల సంఖ్య 3,167కు పెరగడం హర్షణీయమన్నారు. ‘పులుల సంరక్షణ ద్వారా భారత్‌ ప్రకృతి సమతుల్యత సాధించింది. ఇది ప్రపంచానికే గర్వకారణం. ఒకప్పుడు దేశంలో అంతరించిన జాబితాలో చేరిన చీతాలను నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి తెచ్చాం. వాటి సంతతిని విజయవంతంగా పెంచుతున్నాం’ అని చెప్పారు. పులులు, సింహాలు, చిరుతపులులు, మంచు చిరుతలు, ప్యూమా, జాగ్వార్, చీతా వంటి వన్యప్రాణుల్ని సంరక్షించడానికే ఐబీసీఏ ప్రాజెక్టుకు తెర తీసినట్టు చెప్పారు.

Female Cheetah Sasha: ఆడ చీతా సాషా మృతి

#Tags