Waqf Amendment Bill: వక్ఫ్‌ బిల్లు సిఫార్సుకు.. సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు.. కమిటీ సభ్యులు వీరే..

కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో వక్ఫ్ చట్టం సవరణ బిల్లును ప్రవేశపెట్టింది.

వక్ఫ్‌(సవరణ) బిల్లు–2024ను క్షుణ్నంగా పరిశీలించి, మార్పుచేర్పులపై సిఫార్సులు చేయడానికి సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఏర్పాటుకు పార్లమెంటు ఆగ‌స్టు 9వ తేదీ ఆమోదం తెలిపింది. 

ఈ కమిటీలో లోక్‌సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది కలిపి 31 మందిని కమిటీ సభ్యులుగా నియమించారు. ఇందులో 12 మంది బీజేపీ, నలుగురు కాంగ్రెస్‌ సభ్యులున్నారు. ఉభయసభల నుంచి 8 మంది మైనారిటీ సభ్యులు ఉన్నారు. 

వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి వి.విజయసాయిరెడ్డి (వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ), డి.కె.అరుణ (బీజేపీ), అసదుద్దీన్‌ ఒవైసీ (మజ్లిస్‌), లావు శ్రీకృష్ణదేవరాయలు (టీడీపీ) ఉన్నారు. 

Waqf Bill: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు.. వివాదాస్పద భూములపై నిర్ణయాధికారం కలెక్టర్లకే..!

లోక్‌సభ వారు వీరే..
బీజేపీ: జగదంబికా పాల్‌ (ఉత్తర్‌ప్రదేశ్‌), నిషికాంత్‌ దూబే (ఝార్ఖండ్‌), తేజస్వీ సూర్య (కర్ణాటక), అపరాజితా సారంగి (ఒడిశా), సంజయ్‌ జైస్వాల్‌ (బిహార్‌), దిలీప్‌ సైకియా (అస్సాం), అభిజిత్‌ గంగోపాధ్యాయ (పశ్చిమబెంగాల్‌)
కాంగ్రెస్‌: గౌరవ్‌ గొగోయి (అస్సాం), ఇమ్రాన్‌ మసూద్‌ (ఉత్తర్‌ప్రదేశ్‌), మహమ్మద్‌ జావెద్‌ (బిహార్‌)
టీఎంసీ: కల్యాణ్‌ బెనర్జీ (పశ్చిమబెంగాల్‌), డీఎంకె నుంచి ఏ.రాజా (తమిళనాడు)
ఉద్దవ్‌ఠాక్రే శివసేన: అరవింద్‌ సావంత్‌ (మహారాష్ట్ర)
ఎన్సీపీ: మహత్రే బాల్య మామ సురేష్‌ గోపీనాథ్‌ (మహారాష్ట్ర)
జేడీయూ: దిలేశ్వర్‌ కమాయిత్‌ (బిహార్‌)
ఎస్పీ: మోహిబ్బుల్లా (ఉత్తర్‌ప్రదేశ్‌)
శివసేన: నరేష్‌ గణ్‌పత్‌ మహస్కే (మహారాష్ట్ర)
ఎల్‌జేపీ రామ్‌ విలాస్‌ పాసవాన్‌ పార్టీ: అరుణ్‌ భారతి (బిహార్‌) 
ఏఐఎంఐఎం: అసదుద్దీన్ ఒవైసీ(తెలంగాణ‌)

రాజ్యసభ వారు వీరే..
బీజేపీ: బ్రిజ్‌లాల్‌ (ఉత్తర్‌ప్రదేశ్‌), మేధా విశ్రం కుల్‌కర్ణి (మహారాష్ట్ర), గులాం ఆలీ (జమ్మూకశ్మీర్‌), రాధామోహన్‌దాస్‌ అగర్వాల్‌ (ఉత్తర్‌ప్రదేశ్‌)
కాంగ్రెస్‌: సయ్యద్‌ నసీర్‌ హుస్సేన్‌ (కర్ణాటక)
వైఎస్సార్‌సీపీ: విజయసాయిరెడ్డి (ఆంధ్రప్రదేశ్‌)
టీఎంసీ: మహమ్మద్‌ నదీముల్‌హఖ్‌ (పశ్చిమబెంగాల్‌)
డీఎంకె: ఎం.మహమ్మద్‌ అబ్దుల్లా (తమిళనాడు)
ఆప్‌: సంజయ్‌సింగ్‌ (దిల్లీ)
నామినేటెడ్‌ సభ్యుడు: ధర్మస్థల వీరేంద్రహెగ్గడే (కర్ణాటక)

Supreme Court : ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!

#Tags