Manisha Padhi: దేశంలోనే తొలి మహిళా ఏడీసీ.. మా కూతురే మా శక్తి అంటున్న తల్లిదండ్రులు..
అద్దంలో తనను తాను చూసుకుంటూ మురిసిపోయింది. తండ్రి నడకను అనుకరించింది. ఆ రోజు తమ ముద్దుల బిడ్డను చూస్తూ తెగ నవ్వుకున్న మనీషా తల్లిదండ్రులు, ఇప్పుడు కుమార్తె ఉన్నతిని చూసి గర్విస్తున్నారు. స్క్వాడ్రన్ లీడర్ మనీషా సాధి మిజోరం గవర్నర్ సహాయకురాలి (ఏడీసీ)గా నియామకం అయింది. మన దేశంలో గవర్నర్‌కు ఎయిడ్–డి–క్యాంప్ (ఏడీసీ)గా నియామకం అయిన ఫస్ట్ ఉమన్ ఇండియన్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ఆఫీసర్‌గా చరిత్ర సృష్టించింది..
చిన్నప్పటి నుంచే ఆఫీసర్ కావాలని..
మనీషా పధి స్వస్థలం ఒడిషా రాష్ట్రంలోని బెర్హంపూర్. తల్లి గృహిణి. తండ్రి మనోరంజన్ పధి ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్‌గా పనిచేసి రిటైర్ అయ్యాడు. మనీషా చిన్నప్పటి నుంచే చదువులో ముందుండేది. చదువుకు తగ్గ ధైర్యం ఉండేది. తండ్రిలాగే ‘ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్’ కావాలని చిన్నప్పటి నుంచే కలలు కన్నది. చిన్నప్పుడు తండ్రి యూనిఫామ్‌ను పోలిన డ్రెస్‌ను ధరించి సందడి చేసేది.
Revanth Reddy To Be Telangana Chief Minister: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి.. 7న ప్రమాణస్వీకారం..
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో గ్రాడ్యుయేషన్ చేసిన మనీషా ఆ తరువాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో చేరింది. గతంలో ఎయిర్ ఫోర్స్ స్టేషన్–బీదర్, ఎయిర్ ఫోర్స్ స్టేషన్–పుణె చివరగా భటిండాలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో పనిచేసింది ‘ఏడీసీగా మనీషా పధి నియామకం ఒక మైలురాయి మాత్రమే కాదు. లింగ వివక్షతను కాలదన్ని వివిధ రంగాల్లో అద్భుత విజయాలు సాధిస్తున్న మహిళా శక్తికి నిదర్శనం. ఈ అద్భుత విజయాన్ని సెలబ్రేట్ చేసుకుందాం. అన్ని రంగాల్లో మహిళా సాధికారతను కొనసాగిద్దాం’ అని వ్యాఖ్యానించారు మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు.
‘ఎయిడ్–డి–క్యాంప్’ అనేది సాయుధ దళాల్లో ఉన్నత స్థాయి అధికారికి సహాయపడే అధికారి హోదాను సూచిస్తుంది. మన దేశంలో ‘ఎయిడ్–డి–క్యాంప్’ గౌరవప్రదమైన హోదా. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్... మొదలైన వాటిలో సర్వీస్ చీఫ్‌లకు సాధారణంగా ముగ్గురు ‘ఎయిడ్–డి–క్యాంప్’లు ఉంటారు రాష్ట్రపతికి ఆర్మీ నుంచి ముగ్గురు, నేవీ, ఎయిర్ ఫోర్స్ నుంచి ఒక్కొక్కరు చొప్పున మొత్తం అయిదుగురు ఉంటారు. ఇక రాష్ట్ర గవర్నర్‌లకు ఇద్దరిని నియమిస్తారు.
Indian Economy: మూడో అతిపెద్ద ఎకానమీగా అవతరిచననున్న భారత్.. ఎప్పటికల్లా అంటే..
మా కూతురు మా శక్తి..
మనిషా పధి తల్లిదండ్రులు ఒడిషాలోని భువనేశ్వర్‌లో నివాసం ఉంటున్నారు. తమ కుమార్తె మిజోరం గవర్నర్ ‘ఏడీసీ’గా నియామకం కావడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
‘2015లో ఫస్ట్ పోస్టింగ్ నుంచి ఇప్పటి వరకు విధి నిర్వహణకు సంబంధించి ఎంతో అనుభవాన్ని సొంతం చేసుకుంది. ఆ అనుభవమే మనీషాను ‘ఏడీసీ’గా నియామకం అయ్యేలా చేసింది. మనిషా తల్లిదండ్రులుగా ఈ నియామకం విషయంలో సంతోషిస్తున్నాం. గర్విస్తున్నాం’ అంటున్నాడు మనీషా తండ్రి మనోరంజన్ పధి.
‘చదువు విషయంలో, వృత్తి విషయంలో మనీషా మమ్మల్ని సంతోషానికి గురి చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇప్పుడు మాత్రం నా సంతోషాన్ని వ్యక్తీకరించడానికి మాటలు రావడం లేదు. మా అమ్మాయి చిన్నప్పటి నుంచి క్రమశిక్షణతో పెరిగింది’ అంటుంది మనీషా తల్లి.
‘తన కలను నిజం చేసుకోవడానికి సొంత ఊరు దాటి బయటి ప్రపంచంలోకి అడుగు పెట్టినప్పుడు మాతో పాటు మనీషాకు ఎంతో మంది నిరుత్సాహపరిచే మాటలెన్నో చెప్పారు. మనీషా ఒక్క నిమిషం కూడా అధైర్యపడింది లేదు. అలాంటి మాటలను పట్టించుకోవద్దని మేము గట్టిగా చెప్పేవాళ్లం. అమ్మాయిల కెరీర్ డ్రీమ్స్‌కు తల్లిదండ్రులు అండగా నిలబడితే వారు అద్భుత విజయాలు సాధిస్తారు. తల్లిదండ్రులు గర్వపడేలా చేస్తారు’ అంటున్నాడు మనోరంజన్ పధి. మనీషా పధి తల్లిదండ్రులకు ఎన్నో ఫోన్ కాల్స్ వస్తున్నాయి. వాటి సారాంశం ‘మీ అమ్మాయి బంగారం’.