Wooden Satellite: ప్రపంచంలోనే తొలి చెక్క ఉపగ్రహం

ప్రపంచంలోనే తొలిసారిగా కలపతో తయారుచేసిన ఉపగ్రహాన్ని త్వరలో ప్రయోగించేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా), జపాన్‌ ఎక్స్‌ ప్లొరేషన్‌ ఏజెన్సీ(జాక్సా) ప్రయత్నిస్తున్నాయి.

అంతరిక్షయానం కార్యకలాపాలు అందరికీ అందుబాటులో ఉండేలా చేయాలనే లక్ష్యంతో ఈ ప్రయోగానికి సమాయత్తమవుతున్నాయి. సుమిటోమో ఫారెస్ట్రీ సహకారంతో క్యోటో విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు ఈ ఉపగ్రహాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఉపగ్రహం శిథిలమై, క్రమంగా భూమిలో కలిసిపోయే స్వభావం కలది. కాబట్టి భూమి పర్యావరణాన్ని కాపాడటానికి దోహదపడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

#Tags